
సాక్షి, అమరావతి: రాయలసీమ ఎత్తిపోతల పథకాలకు బ్రేకులు వేసేందుకు చంద్రబాబు కుట్రలు మొదలుపెట్టాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అన్నారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. 'గతంలో మహానేత వైఎస్సార్ సీఎంగా ఉండగా జలయజ్ఞం ప్రాజెక్టులకు ఆటంకాలు కల్పించినట్టుగానే సీమ ఎత్తపోతల పథకాలకు బ్రేకులు వేసే కుట్రలు మొదలు పెట్టాడు చంద్రబాబు. ట్రిబ్యునల్స్, కోర్టుల్లో కేసులు వేయించి అనుమతులను అడ్డుకోవాలని చూస్తే ప్రజల ఉసురు తప్పక తగులుతుంది' అని విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ('ఆ గేదె బాబుకు వందల కోట్ల రూపాయల పాలిచ్చింది')