
సాక్షి, తాడేపల్లి: సీఎం జగన్ నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతోందని.. టీడీపీ నేతలకు దమ్ముంటే చర్చకు రావాలని వైఎస్సార్‌సీపీ మహిళా నేత నారమల్లి పద్మజ సవాల్ చేశారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలోచేసిన అభివృద్ధి శూన్యం. ప్రభుత్వంపై తప్పుడు విమర్శలకే చంద్రబాబు పరిమితం. చంద్రబాబు తన పాలనలో ఒక్క వర్గానికైనా న్యాయం చేశారా?. చంద్రబాబు నైజం చూసే ప్రజలు ఏపీ నుంచి తరిమికొట్టారు. ప్రజా తీర్పును చూసి కూడా చంద్రబాబుకు బుద్దిరాలేదు. స్థాయిలేని వ్యక్తులతో సీఎం జగన్‌ను చంద్రబాబు తిట్టిస్తున్నారు.
కొందరు చంద్రబాబు చెంచాలు మాత్రం మద్యం తాగి మాట్లాడుతున్నారు. టీడీపీ నాయకురాలు అనిత తన స్థాయి తెలుసుకుని మాట్లాడాలి. ఆమె తాగే బ్రాండ్ దొరకటం లేదని తెగ బాధ పడుతోంది. చంద్రబాబు గురించి ఎన్టీఆర్ ఏం చెప్పారో జనానికి ఇంకా గుర్తుంది. మాకు సంస్కారం ఉంది. ఆ సంస్కారంతోనే మాట్లాడతాము. ఓటమితో పారిపోయి చంద్రబాబు హైదరాబాద్‌లో దాక్కున్నాడు . టీడీపీ హయాంలో మద్యం ఏరులై పారింది. కానీ మేము మద్యం తగ్గించాం. టీడీపీ చేసే ఉద్యమాల వెనుక ఎన్నో కుయుక్తులు ఉన్నాయి. పసుపు కుంకుమ పేరుతో మహిళలకి డబ్బులు ఇచ్చి గెలవాలనుకున్నాడు. కానీ రాష్ట్ర మహిళలకు ఎవరు ఎలాంటి వారో తెలుసు' అంటూ నారమల్లి పద్మజ చంద్రబాబుపై మండిపడ్డారు.
చదవండి: (వైఎస్సార్‌సీపీ సభ్యత్వ నమోదు ప్రారంభమవుతుంది: విజయసాయిరెడ్డి)
Comments
Please login to add a commentAdd a comment