టీడీపీ సోషల్‌ మీడియా పోస్టులపై విజయసాయిరెడ్డి ఫైర్‌ | Ysrcp Mp Vijayasai Reddy Fires On Tdp Social Media Posts | Sakshi
Sakshi News home page

టీడీపీ సోషల్‌ మీడియా పోస్టులపై విజయసాయిరెడ్డి ఫైర్‌

Published Fri, Oct 11 2024 9:33 PM | Last Updated on Fri, Oct 11 2024 9:39 PM

Ysrcp Mp Vijayasai Reddy Fires On Tdp Social Media Posts

సాక్షి, తాడేపల్లి: టీడీపీ సోషల్‌ మీడియా పోస్టులపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ‘‘తెలుగు దొంగల పార్టీ (పేరుకు తగినట్లుగానే) జ్ఞానం, మర్యాద, అవగాహన లేని పోకిరీలను, పనికిమాలిన కులగజ్జి గాళ్లని, గూండాలని, గోహంతకులని, హిందూ వ్యతిరేకులని, నాస్తికులని, రేపిస్టులని, టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి, విపక్ష నాయకులు పెట్టిన పోస్టులు మీద వ్యక్తిగత దూషణలతో, బూతుపదాలతో కించపరుస్తూ అసభ్యకర వ్యాఖ్యలు చేయడానికి "నెలసరి చెల్లింపు" పద్దతిలో నియమించుకున్న అనైతిక రాజకీయపార్టీ.’’ అంటూ ట్వీట్‌ చేశారు.

‘‘వీరి  తల్లితండ్రులు పెట్టిన అసలు పేర్లతో కాకుండా నకిలీపేర్లతో (చివరన రెడ్డి, శర్మ, షెట్టి, యాదవ్, రాజు వగైరా) తగిలించుకుంటారు. వీరి బజారు ప్రవృత్తి, దిగజారుడుతనం ఎలా ఉంటుందంటే(ఉదాహరణకు స్వాతి చౌదరి వారి రాతల్లో శ్వేతారెడ్డి అవుతుంది). పోలీస్, న్యాయవ్యవస్థలకు దొరకకుండా పని చేస్తారు. ఈ క్యారక్టర్  లేని కిరాయి పేటిఎమ్ బ్యాచ్ దైర్యం ఉంటే అసలు పేర్లతోనే పోస్టులు పెట్టొచ్చు. వీరి వ్యాఖ్యలు టీడీపీ సంస్కృతిని ప్రతిబింబిస్తాయని తెలుసుకోవాలి.

..వారి ముఠా నాయకుడి దృష్టిలో పడాలని పోటీపడి హద్దులుమీరి వ్యాఖ్యలు/పోస్టులు పెడతారు. ఓ కిరాయి మనుషుల్లారా, మీ ఇద్దరు బాసుల కోసం మీరు మరీ దిగజారిపోవద్దు’’ అని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement