ప్రకాశం: చంద్రబాబుకు వారసత్వమే పెద్ద శాపమని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్ధరెడ్డి అన్నారు. లోకేష్ సమర్ధుడైతే చంద్రబాబు పవన్ ఎందుకు అడుక్కుంటాడు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని సాయం కోరాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. వారసత్వం అంటే తండ్రికి తగ్గ తనయుడు సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిదేనన్నారు. దర్శిలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఎప్పుడూ ఎవరితో ఒకరితో పొత్తు పెట్టుకునే ఎన్నికలకు వెళతారని, ఒక్కరే ఎన్నికలకు వెళ్లే ధైర్యం ఆయనకు లేదన్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 20 వేల మందితో పులివెందులలో పాదయాత్ర ప్రారంభిస్తే.. విశాఖపట్టణానికి వెళ్లే సరికి రెండు లక్షల మంది అయ్యారన్నారు. అదే నారా లోకేష్ కుప్పంలో 10 వేల మందితో పాదయాత్ర ప్రారంభిస్తే విశాఖపట్నం పోయే సరికి వెయ్యి మంది కూడా లేరన్నారు.
టీడీపీ నేతలు టీ కొట్ల వద్ద వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాదని చెప్పుకోవడం తప్ప అధికారంలోకి ఉన్నప్పుడు చంద్రబాబు రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. రూ.2.50 లక్షల కోట్లను ప్రజల ఖాతాల్లోకి నేరుగా జమ చేసిన జగన్‌మోహన్‌రెడ్డి కావాలో ప్రజలకు రూపాయి కూడా ఇవ్వకుండా దోచుకున్న చంద్రబాబు కావాలో తేల్చుకోవాలన్నారు. నీరు–చెట్టు పేరుతో దోచుకున్నందుకా, జన్మభూమి కమిటీ అరాచకాలు చూశా..అమరావతి రాజధాని పేరుతో లక్షల కోట్లు దోచుకున్నందుకా..చంద్రబాబు రావాలని కోరుకోవాలా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలోని 15 వేల పంచాయతీల్లో సచివాలయాలు, ఆర్‌బీకేలు, హెల్త్ క్లినిక్‌లకు ఎన్నో వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. ఇటువంటి ముఖ్యమంత్రి ప్రపంచంలో మరెక్కడున్నా వారికే ఓటేయవచ్చన్నారు. ఓటనేది అడిగేలా ఉండాలే గానీ అడుక్కునేలా ఉండకూడదన్నారు. అందరి జీవితాలు మార్చే జగన్‌మోహన్‌రెడ్డి కావాలో అబద్ధాలు చెప్పి మోసం చేసే చంద్రబాబు కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు.
సామాజిక సాధికార బస్సుయాత్రకే వేల మంది జనాలు వస్తున్నారని ఆరోపిస్తున్నారని, మరో 15 రోజుల్లో జగనన్న జనాల్లోకి వస్తున్నారని, అప్పుడు స్పందన చూస్తే టీడీపీ వారికి మాట్లాడటానకి ఏం ఉండదని సవాల్ విసిరారు. ప్రజల జీవితాలు మార్చాలని నవరత్నాలు ప్రవేశపెట్టి పూర్తిస్థాయిలో అమలు చేశారన్నారు. చంద్రబాబు తన శక్తి సామర్థ్యాలపై ఆధారపడలేదని పవన్‌కళ్యాన్, బీజేపీ పెద్దపై ఆధారపడ్డారని విమర్శించారు. దేశంలో ప్రధాన శత్రువులైన బీజేపీని ఒక సంకలో, కాంగ్రెస్‌ను మరో సంకలో పెట్టుకుని నడపాలనుకోవడమే చంద్రబాబు గొప్పతమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవి చదవండి: టీడీపీలో కొత్త ట్విస్ట్.. కుప్పంలో చంద్రబాబుకు ఎదురుగాలి!
Comments
Please login to add a commentAdd a comment