కీర్తి పొందిన చందవరం బౌద్ధక్షేత్రం | Sakshi
Sakshi News home page

కీర్తి పొందిన చందవరం బౌద్ధక్షేత్రం

Published Sun, May 26 2024 7:45 AM

కీర్తి పొందిన  చందవరం బౌద్ధక్షేత్రం

దక్షిణ భారతదేశంలో అతి పెద్ద బౌద్ధ స్థూపంగా చందవరం ప్రసిద్ధి చెందింది. క్రీస్తుపూర్వం రెండో శతాబ్దంలో నిర్మితమైన ఈ క్షేత్రం త్రిపురాంతకేశ్వర క్షేత్రానికి అతి దగ్గరలో ఉంది. దొనకొండ మండలంలోని చందవరం–వెల్లంపల్లిల నడుమ గుండ్లకమ్మ నదిఒడ్డున విరాజిల్లుతోంది. ఈ క్షేత్రంలో గల బౌద్ధ స్థూపం 150 అడుగుల ఎత్తైన కొండపై కొలువు తీరి 120 అడుగుల చుట్టుకొలత, 30 అడుగుల ఎత్తులో ఉంది. గౌతమ బుద్ధుడు, ధ్యానంలో నిమగ్నమై ఉన్న పాలరాతి శిల్పాలు, బౌద్ధరామాలు, విశ్రాంతి గదులు, బౌద్ధ సన్యాసుల ఆశ్రమ గదులు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఈ బౌద్ధరామంలో ముఖ్య సంఘటనలు, ధర్మబోధనలను విశదపరిచే స్తంభాలు ఉన్నాయి. త్రిపురాంతకం నుంచి ఆటోలో వెళ్లవచ్చు.

Advertisement
 
Advertisement
 
Advertisement