వైభవంగా కల్యాణోత్సవం
కొత్తపట్నం: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం వేకువ జామున కల్యాణోత్సవం వైభవంగా సాగింది. గ్రామ పెద్దలు, ఈవో సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో రామలింగేశ్వరస్వామి, కన్నేశ్వరస్వామిలకు పూజలు చేసి కల్యాణోత్సవం నిర్వహించారు. కొత్తపట్నం నాగేశ్వరస్వామి ఆలయంలో ఈవో సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో శివ, పార్వతలకు కల్యాణం నిర్వహించారు. దంపతులు కల్యాణం ముందు పూజలు చేశారు. భక్తులు ఓం నమశివాయ.. హర హర మహాదేవ శంభోశంకర అంటూ ఒక్కసారిగా పోటెత్తారు. ఆలయం ప్రాంగణంలో భక్తులు బారులు తీరారు. పూజలు అనంతరం భక్తులు సముద్రస్నానాలు చేసిన అనంతరం ఆలయానికి వచ్చి దర్శనం చేసుకున్నారు. తీర్థప్రసాదం పంపిణీ చేశారు. భక్తులకు అన్నదానం చేశారు.
వైభవంగా కల్యాణోత్సవం
Comments
Please login to add a commentAdd a comment