అంగరంగ వైభవంగా రథోత్సవం
త్రిపురాంతకం: పార్వతీ త్రిపురాంబా సమేత త్రిపురాంతకేశ్వర స్వామి రథోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని రథంపై ఉంచి హరహర మహాదేవ నినాదాలతో ఊరేగారు. అనంతరం స్వామి, అమ్మవార్లను పల్లకి సేవా ద్వారా ఆలయానికి చేర్చారు. రథోత్సవం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తహసీల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఐ అస్సాన్, ఎస్సై బసవరాజు చర్యలు తీసుకున్నారు. ఆలయాల ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ఇమ్మడిశెట్టి వెంకటసుబ్బారావు, కార్యనిర్వహణాధికారిణి డి.రజని కుమారి కార్యక్రమాలను పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment