
సింగరాయకొండ: ప్రమాదవశాత్తూ రైలు నుంచి జారిపడి సుమారు 47 ఏళ్ల వయసు గల గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన శనివారం ఉదయం 11 గంటల సమయంలో సింగరాయకొండ–ఉలవపాడు రైల్వే స్టేషన్ల మధ్య మూడో రైల్వే లైనుపై జరిగింది. మృతుని వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదని, ఖాకీ రంగు ఫుల్ హాండ్స్ చొక్కా, బిస్కెట్ రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని రైల్వే పోలీసులు తెలిపారు. ఒంటిపై పచ్చ, ఎరుపు, పసుపు గళ్ల కండువా కలిగి ఉన్నాడు. ఇతని ఆచూకీ తెలిసిన వారు ఒంగోలు జీఆర్‌పీ రైల్వేస్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ఎస్సై టి.అరుణకుమారి సూచించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు జీజీహెచ్‌కి తరలించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment