రైతాంగం ఆశలపై నీళ్లు చల్లిన రాష్ట్ర బడ్జెట్
ఒంగోలు టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2025–26 బడ్జెట్ జిల్లా రైతాంగం ఆశలపై నీళ్లు చల్లిందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జజ్జురి జయంతి బాబు, పమిడి వెంకటరావు విమర్శించారు. స్థానిక ఎల్బీజీ భవనంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ..వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.1000 కోట్లు, మొదటి టన్నెల్ అడ్డంకులను తొలగించడానికి రెండో టన్నెల్ పనులను కొనసాగించడానికి మరో రూ.1000 కోట్లు అవసరమవుతాయని చెప్పారు. వెంటనే రూ.2 వేల కోట్లు కేటాయించి యుద్ధ ప్రతిపాదికన పనులు చేపట్టి జూన్ నాటికి వరద నీటిని నల్లమల సాగర్‌కు నీటిని మళ్లించాలని రైతు సంఘం డిమాండ్ చేస్తుందన్నారు. ఇప్పటికే 30 ఏళ్లుగా ప్రజలు వెలుగొండ ప్రాజక్టు కోసం ఎదురు చూస్తున్నారని, అంతటి ప్రాధాన్యత కలిగిన ప్రాజక్టుకు కేవలం రూ.359 కోట్లు మాత్రమే కేటాయించడం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనం అన్నారు. పాలేటిపల్లి రిజర్వాయర్, సంగమేశ్వరం ప్రాజెక్టులను అస్సలు పట్టించుకోకపోవడం అన్యాయం అన్నారు. గుండ్లకమ్మకు రూ.100 కోట్లు కేటాయిస్తేనే కానీ కాలువలకు నీరు ప్రవహించదన్నారు. బడ్జెట్లో సవరణ చేసైనాసరే ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment