
ఆ పిల్లలకు దిక్కెవరు..!
● విద్యుదాఘాతానికి వ్యక్తి మృతి
● ఏడాది క్రితం తల్లి మృతి
● అనాథలైన నలుగురు పిల్లలు
పుల్లలచెరువు: విద్యుదాఘాతానికి వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని పిడికిటివానిపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన దండేబోయిన కోటేశ్వరరావు(38) ఉపాధి హామీ పథకంలో ఆపరేషటర్‌గా పనిచేస్తూ ఉన్న దానిట్లో వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేసుకొని తనకు ఉన్న నలుగురు పిల్లలను చదివించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కోటేశ్వరరావు భార్య ఏడాది క్రితం మృతి చెందింది. అప్పటి నుంచి అన్ని తానై పిల్లలను చూసుకుంటున్నాడు. విధి చిన్న చూపు చూడడంతో శనివారం రాత్రి సమయంలో ప్లాంట్ రిపేరు రావడంతో కోటేశ్వరరావు తనకు ఉన్న పరిజ్ఞానంతో రిపేరు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురైఅక్కడికక్కడే మృతి చెందాడు. పక్క ఇళ్లవారు వచ్చి చూసే సరికి మృతి చెంది ఉండడంతో వారి పిల్లల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం ఒక్కసారిగా మార్మోగింది. కోటేశ్వరరావు ఇటీవల వరకు పుల్లలచెరువులో పనిచేసి ఇటీవలనే యర్రగొండపాలెం కార్యాలయానికి బదిలీపై వెళ్లాడు. అందరికీ పరిచయమైన వ్యక్తిగా మంచి పేరు సంపాదించుకున్న కోటేశ్వరరావు మృతితో చిన్నారులు అనాథలుగా మిగిలారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment