యర్రగొండపాలెం: అటవీ జంతువుల కోసం ఉచ్చులు వేసి చిరుత పులి మరణానికి కారణమైన ఇద్దరు నిందితులను అటవీ శాఖాధికారులు ఆదివారం అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే..గత నెల 15వ తేదీ రాత్రి కొలుకుల సెక్షన్‌లోని వరదరాజు స్వామి గుడి ప్రాంతంలో అటవీ జంతువులను వేటాడటానికి మండలంలోని పెద్ద కొలుకుల గ్రామానికి చెందిన దొంత రామయ్య, దొంత యల్లయ్యలు ఉచ్చులు వేశారు. ఈ ఉచ్చులో చిరుత పులి చిక్కుకుంది. తప్పించుకునే వీలులేక పోవడంతో మరుసటి రోజు ఆ పులి మృతి చెందింది. ఈ కేసు ముమ్మరం చేసిన ఫారెస్ట్ అధికారులు డాగ్ స్క్వాడ్‌ను రప్పించారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ ఫుటేజీను సేకరించి నిందితులను గుర్తించి వారితో పాటు అనుమానితులైన మరో ముగ్గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అరెస్ట్ అయిన మొదటి నిందితుడు రామయ్య ఇంటి వద్ద 3కణితి కొమ్ములు, 2చుక్కల దుప్పి కొమ్ములు, 2 సెల్‌ఫోన్‌లు, కత్తి, టార్చ్‌లైట్, మోటారు బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వారు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment