
యోగాతో ఒత్తిడి దూరం
ఒంగోలు టౌన్: నిత్యం మానసిక ఒత్తిడికి గురయ్యే మహిళా పోలీసులు యోగా ద్వారా ఉపశమనం పొందవచ్చని ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్‌బాబు సూచించారు. యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మానసికంగా కూడా ధృఢంగా వుంటారని చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీసు కళ్యాణ మండపంలో మహిళా పోలీసులకు యోగా నిర్వహించారు. ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరూ పని ఒత్తిడికి గురవుతున్నారని, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు మానసిక ఒత్తిడితో సతమతమవుతున్నారన్నారు. మెడిటేషన్, యోగాలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని, జీవితంలో విజయం సాధించడానికి ఉపయోగపడతాయన్నారు. మానసిక భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం ద్వారా అన్ని రంగాల్లో విజయం సాధించడం సాధ్యమవుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ కె.శ్రీనివాసరావు, ఆర్ సీతారామిరెడ్డి, యోగా గురువు బాలు, మహిళా పోలీసులు, హోంగార్డులు, డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు.

యోగాతో ఒత్తిడి దూరం
Comments
Please login to add a commentAdd a comment