● పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు
పెద్దదోర్నాల: మహిళా ఉద్యోగిపై వేధింపులకు పాల్పడిన ఏపీఎంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వివరాల ప్రకారం.. మండలంలోని వెలుగు కార్యాలయంలో రైతు ఉత్పత్తిదారుల సంఘంలోని విభాగంలో అకౌంటెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళ పట్ల ఏపీఎం దర్శనం పోలయ్య అసభ్యంగా ప్రవర్తించాడు. కొద్ది రోజుల నుంచి వేధింపులకు గురిచేస్తున్నాడు. దానికితోడు జీతం ఇవ్వాలంటే రూ.5 వేలు లంచం కావాలని కూడా డిమాండ్ చేశాడు. దీంతో బాధిత మహిళ స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment