లైంగిక వేధింపుల చట్టాలపై మహిళలకు అవగాహన
ఒంగోలు టౌన్: కర్మాగారాల్లో పనిచేసే మహిళలు, విద్యాసంస్థల్లో చదువుకునే బాలికలకు లైంగిక వేధింపుల చట్టాలపై అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు చెప్పారు. జీజీహెచ్ ఆర్‌బీఏకే కార్యాలయంలో మంగళవారం పిల్లల లైంగిక వేధింపులపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. లైంగిక వేధింపులను ఎదుర్కొనేందుకు మానసికంగా, శారీరకంగా సంసిద్ధంగా ఉండాలని సూచించారు. ఆరోగ్య, పాఠశాల విద్య, ఇంటర్మీడియెట్, వికలాంగుల సంక్షేమం, మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులకు ఇస్తున్న ఈ శిక్షణలో మహిళా చట్టాలను పరిచయం చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా మానసిక వ్యాధుల నిపుణులు డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ మహిళలు, విద్యార్ధినులకు పోక్సో చట్టం గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత సమాజంలో లైంగిక దోపిడీ ఎక్కువగా జరుగుతోందన్నారు. వనరుల కొరత, ఆహారం, ఆర్ధిక భద్రత మహిళలకు శాపంగా మారిందన్నారు. కార్యక్రమంలో ఎన్‌సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ భగీరధి, జిల్లా విద్యా శాఖ అధికారి కిరణ్ కుమార్, సైకాలజిస్టులు సుప్రజా దేవి, గిరి రంగ ప్రసాద్, ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆఫీసర్ హేమ సుజన్, మాస్ మీడియా జిల్లా అధికారి డి.శ్రీనివాసులు, డాక్టర్ ప్రీతమ్, మండల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు
Comments
Please login to add a commentAdd a comment