మహిళా దినోత్సవాన్ని విజయవంతం చేయాలి
●వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ
ఒంగోలు సిటీ: రేపు జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ పిలుపునిచ్చారు. గురువారం ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రమణమ్మ మాట్లాడారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మహిళా దినోత్సవంలో భాగంగా జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మను సన్మానించనున్నట్లు తెలిపారు. ముఖ్య అతిథులుగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జ్‌లు, ముఖ్య నాయకులు పాల్గొంటున్నట్లు వెల్లడించారు. విలేకర్ల సమావేశంలో వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర నాయకురాలు భూమిరెడ్డి రమణమ్మ, ఒంగోలు నియోజకవర్గ అధ్యక్షురాలు బడుగు ఇందిర, హనుమంతునిపాడు ఎంపీపీ గాయం సావిత్రి, నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షురాలు పేరం ప్రసన్న, జి.మేరీ, సయ్యద్ అప్సర, పార్టీ జిల్లా సెక్రటరీ జాన్సీ, తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ విగ్రహాన్ని అవమానపరిచిన విద్యార్థుల సస్పెన్షన్
ఒంగోలు టౌన్: స్థానిక రెడ్డి హాస్టల్లో బుధవారం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి టీడీపీ జెండాలు కట్టి అవమానించిన విద్యార్థులపై క్విస్ ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ ఘటనకు పాల్పడిన ఆరుగురు విద్యార్థులను సస్పెండ్ చేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న వి.హేమంత్, జి.రితీష్, బీవీ చక్రధర్, పి.విష్ణు, పి.మణి, కె.భానులను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు తెలియజేసింది. తదుపరి నిర్ణయం వరకు వీరి సస్పెన్షన్ అమలులో ఉంటుందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment