మహిళా పోలీసులు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి
ఒంగోలు టౌన్: విధి నిర్వహణలో నిత్యం మానసిక ఒత్తిడికి గురయ్యే మహిళా పోలీసులు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రతలు తీసుకోవాలని, ఆరోగ్య రక్షణకు తగినంత ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక పోలీసు కళ్యాణ మండపంలో మహిళా సిబ్బందికి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. డీపీఓ మహిళా సిబ్బంది, సచివాలయ మహిళా పోలీసులు, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ పాల్గొని మాట్లాడుతూ మహిళా సిబ్బందికి ఏదైనా ఆరోగ్య సమస్యలుంటే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. నిత్యం వ్యాయామం, యోగా చేయాలని, మంచి ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలని సూచించారు. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటూ నిర్దేశిత లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్‌బాబు, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర, ట్రాఫిక్ సీఐ పాండురంగారావు, సింగరాయకొండ సీఐ హజరత్తయ్య, అర్‌ఐ సీతారామరెడ్డి, పోలీసు యూనిట్ డాక్టర్ భానుమతి, వైద్యులు థేరాజ్, లావణ్య, శ్యామసుందరి, శిల్ప, ప్రియాంక, జహంగిర్, ఆనంద్ యాదవ్, హైందవి, ప్రియదర్శిని, కిరణ్ కుమార్‌రెడ్డి, రామాంజనేయులు, ప్రవీణ్, శుభశ్రీ తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ ఏఆర్ దామోదర్
Comments
Please login to add a commentAdd a comment