వెన్నుపోట్లు | - | Sakshi
Sakshi News home page

వెన్నుపోట్లు

Published Sat, Mar 8 2025 1:29 AM | Last Updated on Sat, Mar 8 2025 1:28 AM

వెన్న

వెన్నుపోట్లు

వెలుగొండపై ఇంతటి నిర్లక్ష్యమా

మార్కాపురం: ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాల్లో శాశ్వతంగా కరువు నివారించే పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణపనులపై నీలి నీడలి కమ్ముకున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బడ్జెట్‌లో కేవలం రూ.309.13 కోట్లు కేటాయించడంతో సిబ్బంది జీతభత్యాలకు మాత్రమే సరిపోతుందని ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తుతున్నారు.

ప్రాజెక్టు నిర్మాణం ఇలా:

ప్రాజెక్టు వల్ల 4.47 లక్షల 300 ఎకరాలకు సాగునీరు, 15.25 మంది లక్షల మందికి తాగు నీరు అందించేలా డిజైన్‌ చేశారు. దివంగత వైఎస్సార్‌ ప్రాజెక్టును ప్రారంభించగా 2014 నాటికి ప్రాజెక్టు కోసం రూ.1448.14 కోట్లు ఖర్చు పెట్టారు. గొట్టిపడియ, సుంకేసుల, కాకర్ల డ్యాంలు పూర్తయ్యాయి. 1వ టన్నెల్‌ 11.50 కిలో మీటర్లు పూర్తికాగా, 2వ టన్నెల్‌ 9 కిలోమీటర్లు పూర్తైంది. టన్నెల్‌ 1 పనులు 62 శాతం, టన్నెల్‌ 2 పనులు 48 శాతం పూర్తయ్యాయి. 2014–18 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో వెలిగొండకు రూ.600 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యలపై దృష్టి సారించలేదు. 1వ టన్నెల్‌కు సంబంధించి కేవలం 2 కిలోమీటర్లు మాత్రమే పనులు జరిగాయి.

2019– 24 మధ్య జరిగిన అభివృద్ధి ఇదీ..

2019–24 మధ్య వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ప్రాజెక్టు పనులకు రూ.822.08 కోట్లు ఖర్చుపెట్టారు. ఇంకా భూసేకరణకు రూ.79.21 కోట్లు, పునరావాస కల్పనకు రూ.76.73 కోట్లు కేటాయించారు. దోర్నాల మండలం కొత్తూరు వద్ద రెండు టన్నెల్‌ పనులు పూర్తయ్యాయి. ఒక్కొక్క టన్నెల్‌ 18.8 కిలో మీటర్ల పొడవుతో నిర్మించారు. మొదటి టన్నెల్‌ పనులు పూర్తి చేయగా, రెండో టన్నెల్‌ పనులు కూడా వేగంగా చేపట్టారు. తీగలేరు, గొట్టిపడియ, తూర్పు ప్రధాన కాలువ, ఉపకాలువలు, ఉదయగిరి ఉపకాలువ, పడమర ఉపకాలువ, టి–5 కాలువల పనులు పూర్తయ్యాయి. 3 గ్యాప్‌ల నిర్మాణం వల్ల 11 గ్రామాలు మునిగిపోనున్నాయి. ఇందులో మొత్తం 7270 కుటుంబాలు ఉన్నాయి. వీరిలో కొంతమందికి వన్‌టైమ్‌ సెటిల్‌మెంటు, మరికొంత మందికి ఆర్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాల్సి ఉండగా, ఈ బడ్జెట్‌లో కేటాయింపులు లేకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వంలో పునరావాస కాలనీలకు శ్రీకారం చుట్టారు. సిమెంటు రోడ్లు, వాటర్‌ట్యాంకులు, పాఠశాలలను నిర్మించారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వీటిని పట్టించుకోకపోవడంతో చిల్లచెట్లతో నిండిపోయాయి.

మహిళల నమ్మకాన్ని పోగొట్టుకున్నారు

మహిళల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తామని చెప్పి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. ఇప్పటికి 9 నెలలు అవుతున్నాయి. కనీసం ఒక్కటంటే ఒక్క పథకం కూడా సంపూర్తిగా అమలు చేయడం లేదు. తల్లికి వందనం ఎగవేశారు. ఉచిత బస్సును అడ్రస్‌ లేకుండా చేశారు. నెలకు రూ.1500 ఒక భ్రమగా మిగిలింది. మహిళలను అన్నీ రకాలుగా మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ దగా చేసేందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అడ్డుపెట్టుకుంటున్నారు. ఆయన మహిళల నమ్మకాన్ని పోగొట్టుకున్నారు. ఎన్ని వేషాలు వేసినా నమ్మే పరిస్థితి లేదు.

– కంకణాల రమాదేవి, ఐద్వా జిల్లా కార్యదర్శి

మహిళలను ఎల్లకాలం మోసం చేయలేరు

ఒకసారి చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయిన మహిళలు మరోసారి నమ్మడానికి సిద్ధంగా లేరు. గత ఎన్నికల్లో సూపర్‌ సిక్స్‌ అన్నారు. అదెక్కడికి పోయిందో అర్థం కావడం లేదు. రాష్ట్రంలో కోటి 54 లక్షల కుటుంబాలకు ఏడాదికి మూడు వంట గ్యాస్‌ సిలిండర్లు ఇవ్వాలంటే ఏడాదికి రూ.4 వేల కోట్లు అవసరమవుతాయి. కానీ కేవలం రూ.895 కోట్లు మాత్రమే కేటాయించడం చంద్రబాబు దగాకోరుతనానికి నిదర్శనం. సూపర్‌ సిక్స్‌ పథకాలను అమలు చేసిన తరువాతనే చంద్రబాబు మహిళా దినోత్సవాలకు రావాలి.

– బి.పద్మ, పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి

ఇలా అయితే వెలుగొండ ఎప్పటికి పూర్తవుతుంది ?

ఇటీవల బడ్జెట్‌లో వెలుగొండ ప్రాజెక్టుకు రూ.309.13 కోట్లు మాత్రమే కేటాయించారు. వీటితో వెలుగొండ ప్రాజెక్టు పనులు పూర్తిచేసి, నిర్వాసితులకు న్యాయం చేసి నీళ్లెప్పుడు ఇస్తారో అర్థం కావడం లేదు. చంద్రబాబునాయుడు వెలుగొండకు బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించి త్వరితగతిన ప్రాజెక్టును పూర్తిచేయాలి. పునరావాస కాలనీలు నిర్మించి నిర్వాసితులకు న్యాయం చేయాలి.

– జంకె వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ మాజీ చైర్మన్‌

పునరావాస పనులకు నిధులెక్కడ

ఇటీవల బడ్జెట్‌లో ప్రకటించిన వెలుగొండ ప్రాజెక్టు నిధుల్లో పునరావాస కాలనీలకు ఎంత నిధులు కేటాయిస్తారో చెప్పలేదు. మార్కాపురం మండలం కుంట వద్ద గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన పునరావాస కాలనీలో పిచ్చిచెట్లు పడ్డాయి. ప్రభుత్వం వెంటనే ప్రత్యేకంగా నిధులు కేటాయించి పునరావాస కాలనీలు పూర్తిచేయాలి.

– నల్లబోతుల కొండయ్య, గొట్టిపడియ

No comments yet. Be the first to comment!
Add a comment
వెన్నుపోట్లు1
1/3

వెన్నుపోట్లు

వెన్నుపోట్లు2
2/3

వెన్నుపోట్లు

వెన్నుపోట్లు3
3/3

వెన్నుపోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement