
భూ సమస్య చెప్పుకొందామంటే అడ్డుకున్నారు
సీఎంను కలవనీయలేదని వృద్ధురాలి ఆవేదన
మార్కాపురం: తన భూమిని అన్యాయంగా వీఆర్‌ఓ ఆన్‌లైన్ చేసుకున్నాడని సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వృద్ధ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. మండుటెండను సైతం లెక్క చేయకుండా ఎంతో దూరం నుంచి వస్తే ముఖ్యమంత్రి వద్దకు వెళ్లకుండా అధికారులు అడ్డుకున్నారని మీడియా ఎదుట గోడు వెళ్లబోసుకుంది. కొనకనమిట్ల మండలం నాగంపల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు మాణిక్యమ్మ శనివారం మార్కాపురం పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబును కలిసేందుకు వచ్చింది. తన పొలాన్ని గ్రామ వీఆర్‌ఓ అన్యాయంగా ఆన్‌లైన్ చేసుకోవడంపై తహసీల్దార్, ఆర్డీఓకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో తనకు జరిగిన అన్యాయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు అర్జీ చేతపట్టుకుని ఎండను సైతం లెక్క చేయకుండా మార్కాపురం చేరుకుంది. ఇక్కడి తర్లుపాడు రోడ్డులో మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వద్ద సీఎంను కలిసేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఆర్డీఓ తాను కచ్చితంగా సమస్యను పరిష్కరిస్తానని చెప్పడంతో ఉసూరుమంటూ వెనుదిరిగింది.
Comments
Please login to add a commentAdd a comment