
దొడ్డు బియ్యం తినలేకపోతున్నాం
కనిగిరిరూరల్: ‘రోజూ లావు బియ్యంతో అన్నం పెడుతున్నారు. అది తినలేకపోతున్నాం. మంచి నీళ్లకు చాలా ఇబ్బంది పడుతున్నాం. హాస్టల్ బిల్డింగ్ కూడా బాగోలేదు’ అని కనిగిరి బీసీ గురుకులం విద్యార్థులు రాష్ట్ర మంత్రులు ఎస్. సవి, ఆనం రామనారయణరెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కనిగిరి వచ్చిన ఇద్దరు మంత్రులు.. ఇక్కడి మహాత్మాజ్యోతిరావు పూలే బీసీ గురుకుల బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేశారు. మెనూ, ఇతర వసతుల గురించి ఆరా తీస్తున్న సమయంలో విద్యార్థులు తమ అవస్థలను తెలియజేశారు. మెనూ అమలు తీరు, హాజరు, స్టాక్ రికార్డులను పరిశీలించిన అనంతరం మంత్రి సవిత విలేకర్లతో మాట్లాడుతూ.. వచ్చే ఏడాది నుంచి వసతి గృహాలకు బీపీటీ బియ్యాన్ని అందజేస్తామని చెప్పారు. హాస్టల్లో విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత తక్కువగా ఉందని, స్టాక్ రిజిస్టర్ నిర్వహణ సక్రమంగా లేదని గుర్తించి తగిన చర్యలకు ఆదేశాలిచ్చామన్నారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ.. వెలిగొండ ప్రాజెక్టును తప్పకుండా పూర్తి చేసి కనిగిరి, మార్కాపురం, దర్శి, పొదిలి తదితర ప్రాంతాలకు తాగు, సాగు నీటి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.
మంత్రులు సవిత, ఆనం ఎదుట గురుకుల పాఠశాల ఆవేదన
Comments
Please login to add a commentAdd a comment