గుండెపోటుతో కుటుంబ పెద్ద మృతి... రోడ్డున పడ్డ భార్య, ఇద్దరు కూతుళ్లు | - | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో కుటుంబ పెద్ద మృతి... రోడ్డున పడ్డ భార్య, ఇద్దరు కూతుళ్లు

Published Sun, Aug 6 2023 12:24 AM | Last Updated on Sun, Aug 6 2023 5:24 PM

- - Sakshi

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కుటుంబ పెద్ద గుండెపోటుతో మృతిచెందడంతో భార్యపిల్లలు రోడ్డున పడ్డారు. పాతికేళ్ల వయసులోనే ఇద్దరు కూతుళ్ల పెంపకం బాధ్యతలు ఆమైపె పడ్డాయి. సొంతిల్లు లేక బంధువుల ఇంట్లో తలదాచుకుంటున్నారు. దాతలు స్పందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎల్లారెడ్డిపేటకు చెందిన కోల ప్రవీణ్‌గౌడ్‌ (30)కు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఇసాయిపేటకు చెందిన రేఖతో 2019లో వివాహమైంది.

వీరికి ఇద్దరు కూతుళ్లు తన్విత(2), తపస్య(1). ప్రవీణ్‌గౌడ్‌ కొంతకాలం హైదరాబాద్‌లో ప్రైవేట్‌ కాంట్రాక్ట్‌ నిర్వహిస్తుండగా అది ఆగిపోవడంతో కామారెడ్డిలో అద్దె ఇంట్లో ఉంటూ ఆటో నడుపుకుంటున్నాడు. ఈనెల 1వ తేదీ అర్ధరాత్రి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ప్రవీణ్‌ అకాల మరణంతో కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది. సొంత ఇల్లు లేక, కుటుంబపెద్ద మరణించడంతో వారు రోడ్డున పడ్డారు.

ఇద్దరు కూతుళ్లతో చిన్నవయసులోనే పుట్టెడు కష్టాలు రేఖను వెంటాడుతున్నాయి. దాతలు స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. సహాయం చేయాలనుకునే వారు రేఖ 99125 33064, విఘ్నేశ్‌ 95425 25145 ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా ఆదుకోవాలని కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement