
వేములవాడరూరల్: ప్రజల అండతో గెలిచిన తమను కొందరు నాయకులు చిన్నచూపు చూస్తున్నారని, ఇక పార్టీలో ఉండలేమంటూ వేములవాడ రూరల్ మండలంలోని బీఆర్‌ఎస్‌కు చెందిన పలు వురు ప్రజాప్రతినిధులు జిల్లా స్థాయి నాయకులకు శుక్రవారం మొరపెట్టుకున్నట్లు తెలిసింది. జిల్లా కేంద్రానికి శుక్రవారం మంత్రి కేటీఆర్ వచ్చిన విష యం తెలిసిందే.
ఈ సభను విజయవంతం చేసేందుకు కొంత ఫండ్‌ను వేములవాడరూరల్ మండలానికి చెందిన ఒక నాయకుడికి రాగా.. ఎవరికీ ఇ వ్వకపోవడంపై వారు కలత చెందినట్లు తెలిసింది. 17 గ్రామాల్లో ప్రజల ఓట్లతో గెలిచిన తమను కాదని పార్టీకి చెందిన మండలస్థాయి నాయకుడు వ్యవహరించిన తీరు సరిగ్గా లేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనిపై పలువురు రాజీనామాకు సిద్ధమైనట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment