సీఎం సారూ.. స్పందించాలి మీరు! | - | Sakshi
Sakshi News home page

సీఎం సారూ.. స్పందించాలి మీరు!

Published Wed, Nov 20 2024 12:07 AM | Last Updated on Wed, Nov 20 2024 12:07 AM

సీఎం

సీఎం సారూ.. స్పందించాలి మీరు!

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌:

మ్మడి కరీంనగర్‌ జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే అత్యంత పురాతన, చారిత్రక ఆలయం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవాలయం. హైదరాబాద్‌ సంస్థానంలోనూ నిజాంరాజులు పెద్దపీట వేసిన ఏకై క ఆలయం. 1830 లోనే దక్షిణ భారతదేశంలో రోజుకు రూ.4 లక్షల ఆదాయం ఉన్న ఆలయాలు రెండే. ఒకటి తిరుపతి, రెండోది వేములవాడ. అంతటి ఘనచరిత్ర కలిగిన ఆలయంలో బుధవారం కోడెమొక్కులు చెల్లించుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి వస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు టీటీడీ, యాదాద్రి(ప్రతిపాదన దశ) తరహాలో స్వయం ప్రతిపత్తితో కూడిన ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.

అటానమస్‌ హోదాకు ప్రయత్నాలు

రాజన్న ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. తెలంగాణ, ఏపీతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల భక్తులకు రాజరాజేశ్వర స్వామివారు ఇలవేల్పు. కోరిన కోర్కెలు తీర్చే దేవునిగా అనాదిగా పూజిస్తున్నారు. ఒకప్పుడు భక్తుల రద్దీని గమనించిన నాగిరెడ్డి అనే ధర్మకర్త వేములవాడలో మరో కోనేరు నిర్మించారు. ఇది నిజామాబాద్‌, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వచ్చే వారికి అనుకూలంగా ఉండేది. క్రమంగా ఇది పాడవుతోంది. ప్రధాన ఆలయంతోపాటు బద్దిపోచమ్మ, భీమన్న ఆలయాలు కూడా పురాతనమైనవే. దేవస్థానానికి ఉప ఆలయాలుగా ఉన్న నాంపల్లి లక్ష్మీనరసింహస్వామి, మామిడిపల్లి సీతారామచంద్ర స్వామి తదితర ఆలయాలను కలిపి క్లస్టర్‌గా అటానమస్‌ బోర్డును ఏర్పాటు చేసి(వీటీడీఏ కాకుండా), అభివృద్ధి చేయాలని రాజన్న ఆలయ ఉద్యోగులు, భక్తులు కోరుతున్నారు. యాదాద్రికి డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు చేసిన సమయంలో వేములవాడలోనూ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ వచ్చింది. వెంటనే అప్పటి సీఎం కేసీఆర్‌ ఇక్కడ వేములవాడ టెంపుల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(వీటీడీఏ)ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు యాదాద్రికి అటానమస్‌ హోదా కల్పించేందుకు ప్రయత్నాలు మొదలైన దరిమిలా.. వేములవాడకూ కల్పించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఆదాయం జీతాలు, పింఛన్లకే..

ఆలయానికి ప్రధానంగా కోడె మొక్కులు, హుండీ ద్వారా ఆదాయం వస్తుంది. ఆలయ నిర్వహణ ఖ ర్చు ఏటా రూ.200 కోట్ల పైమాటే. ఇందులో అధికశాతం దాదాపు రూ.30 కోట్ల వరకు జీతాలు, పింఛన్లకే వెచ్చిస్తుండటం వల్ల ఆలయ అభివృద్ధికి నిధులు సరిపోవడం లేదు. ఇవిగాక కరెంటు బిల్లులు, ప్రసాదాలు, శివరాత్రి, ఇతర ఉత్సవాలు కలిపితే వచ్చే ఆదాయం కంటే ఖర్చయ్యేదే ఎక్కువ. అందు కే, ప్రత్యేక అటానమస్‌ బోర్డు ఉంటే తప్ప అభివృద్ధి ఊపందుకోదని పలువురు భక్తులు అంటున్నారు.

తాజా నిర్ణయాలపై హర్షం..

వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం అభివృద్ధి పనులకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం రూ.127.65 కోట్లు విడుదల చేయడాన్ని స్థానికులు స్వాగతిస్తున్నారు. ఇందులో ఆలయ కాంప్లెక్స్‌ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకు రూ.76 కోట్లు, ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు ఉన్న రోడ్లను విస్తరించేందుకు రూ.47.85 కోట్లు మంజూరు చేసింది. అలాగే, మూలవాగులో బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్‌ జంక్షన్‌ వరకు రూ.3.8 కోట్లతో నూతన డ్రైనేజీ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. అలాగే, వీటీడీఏ పరిధిని మొత్తం జిల్లాకు విస్తరించడం, పట్టణీకరణకు పెద్దపీట వేయడంపై రాజన్నసిరిసిల్ల జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

విమానాశ్రయంపై చర్చ..

వరంగల్‌లో మామునూరు విమానాశ్రయ నిర్మాణంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసి, నిధులు విడుదల చేసిన నేపథ్యంలో బసంత్‌నగర్‌ విమానాశ్రయంపై మరోసారి చర్చ మొదలైంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం ఈ విషయమై సానుకూలత వ్యక్తం చేయడంతో ఆశలు చిగురించాయి. గత ప్రభుత్వ హయాంలో సర్వే చేసి, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు నివేదిక సమర్పించినా పురోగతి లేదు. వరంగల్‌ ఎయిర్‌పోర్టు సాకారమవుతున్న వేళ.. బసంత్‌నగర్‌ విమానాశ్రయంపైనా స్పష్టమైన హామీ ఇవ్వాలని ఉమ్మడి కరీంనగర్‌ జిల్లావాసులు కోరుతున్నారు.

నిజాం షుగర్స్‌పై గంపెడాశలు

జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలంలోని ముత్యంపేట నిజాం షుగర్స్‌ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించాల్సి ఉంది. వాస్తవానికి రూ.210 కోట్ల బ్యాంకు బకాయిలకు గానూ ప్రభుత్వం ఇప్పటికే రూ.192 కోట్లు చెల్లించింది. మిగతా మొత్తం చెల్లింపు, ఉద్యోగులకు వేతనాలు, పింఛన్ల సర్దుబాటుకు పరిష్కార మార్గాలు వెదుకుతోంది. ఫ్యాక్టరీ పునఃప్రారంభమైతే ఉపాధితోపాటు జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని జగిత్యాల జిల్లావాసులు గంపెడాశలు పెట్టుకున్నారు.

దుష్ప్రచారానికి తెర

ఒకప్పుడు రాజన్న ఆలయానికి వస్తే పదవీ గండం అన్న దుష్ప్రచారం ఉండేది. కానీ, అదంతా వట్టిదే అని తేలిపోయింది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి బండి సంజయ్‌, సీఎం రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ల విజయాలే ఇందుకు నిదర్శనం. పాత ప్రచారం పోయి, ఇప్పుడు రాజన్నకు కోడెమొక్కులు చెల్లిస్తే విజయం తథ్యమన్న మాట విస్తృతంగా వాడుకలోకి వచ్చింది.

‘రాజన్న’కు స్వయం ప్రతిపత్తి కావాలి

టీటీడీ తరహాలో అటానమస్‌ హోదా కల్పించాలంటున్న భక్తులు

హైదరాబాద్‌ సంస్థానంలో అత్యంత ప్రాచీన ఆలయంగా ఎములాడ

వేములవాడ రాజరాజేశ్వరునికి నేడు సీఎం రేవంత్‌రెడ్డి కోడె మొక్కులు

బసంత్‌నగర్‌ విమానాశ్రయం, నిజాం షుగర్స్‌ హామీలపై చర్చ

రాజన్న ఆలయం వద్దనే అన్నీ..

ఇదీ వేములవాడలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన షెడ్యూల్‌

సిరిసిల్ల/వేములవాడఅర్బన్‌: : వేములవాడ రాజన్న ఆలయం వద్దనే సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన షెడ్యూల్‌ను ఖరారు చేశారు. హైదరాబాద్‌ బేగంపేట నుంచి ఉదయం 9గంటలకు హెలీకాప్టర్‌లో బయలుదేరి 9.45కు వేములవాడ చేరుకుంటారు. ఉదయం 9.55గంటలకు పోలీస్‌ గౌరవ వందనం స్వీకరిస్తారు. 10గంటల నుంచి 10.15 వరకు ఆలయ అతిథిగృహంలో రెస్ట్‌ తీసుకుంటారు. 11గంటలకు రాజన్న ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. 11.45 గంటలకు ధర్మగుండం వద్ద శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. 12.15గంటలు అతిథి గృహానికి చేరుకుంటారు. 12.30నుంచి 1.40 వరకు రాజన్న ఆలయం గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు. 1.45 గుడిచెరువు గ్రౌండ్‌ హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. హైదరాబాద్‌కు హెలీకాప్టర్‌లో బయల్దేరి 2.30 గంటలకు బేగంపేటకు చేరుకుంటారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్‌ను ఖరారు చేసినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.

పకడ్బందీ ఏర్పాట్లు

వేములవాడలో బుధవారం జరిగే సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. సీఎం పర్యటనకు తీసుకోవాల్సిన భద్రత ఏర్పాట్లు, ఇతర చర్యలపై సీఎం సెక్యూరిటీ సిబ్బంది, పోలీస్‌, ఇతరశాఖల అధికారులతో కలిసి కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా సమీక్షించారు. సీఎం రేవంత్‌రెడ్డి వేములవాడకు ఉదయం చేరుకుంటారని తెలిపారు. శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని, పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేస్తారని పేర్కొన్నారు. అనంతరం బహిరంగసభలో పాల్గొంటారన్నారు. సభ అనంతరం అతిథిగృహం వద్ద లంచ్‌చేసి హెలికాప్టర్‌ ద్వారా హైదరాబాద్‌ వెళ్తారని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో విధులు నిర్వహించే సిబ్బందికి ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు అందిస్తామని, అవి ఉన్నవారిని మాత్రమే పోలీసులు అనుమతిస్తారని తెలిపారు. సీఎం కాన్వాయ్‌లో పూర్తి సిబ్బందితో కూడిన అంబులెన్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. బహిరంగసభ వద్ద మెడికల్‌క్యాంపు పెట్టాలన్నారు. ఎస్పీ అఖిల్‌ మహాజన్‌, అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌, అదనపు ఎస్పీలు చంద్రయ్య, శేషాద్రినిరెడ్డి, వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్‌ పాల్గొన్నారు.

ధార్మిక.. కార్మిక క్షేత్రంలో సమస్యలు ఇవీ..

రాజన్నసిరిసిల్ల జిల్లా ధార్మిక, కార్మిక, కర్షక క్షేత్రంగా సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలతో పాటు 261 గ్రామాలతో విస్తరించి ఉంది. చిన్నజిల్లాగా పేరున్న ఈ జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలు ప్రజలకు ప్రతిబంధంకంగా మారాయి. ప్రతిపక్ష నేతగా రేవంత్‌రెడ్డి ఇక్కడికి అనేక పర్యాయాలు వచ్చినా.. సీఎం హోదాలో వేములవాడకు తొలిసారి బుధవారం వస్తున్నారు. ప్రజా సమస్యలపై అవగాహన కలిగిన సీఎం రేవంత్‌రెడ్డిపై జిల్లా ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలో రెండు పాయలుగా అటు మానేరు.. ఇటు మూలవాగు పారుతుంది. ధార్మిక క్షేత్రమైన వేములవాడ, కార్మిక క్షేత్రమైన సిరిసిల్ల, కర్షకుల నిలయాలైన పల్లెల్లో నెలకొన్న ప్రధాన ప్రధాన సమస్యలు ఇవీ.. – సిరిసిల్ల

8లోu

No comments yet. Be the first to comment!
Add a comment
సీఎం సారూ.. స్పందించాలి మీరు!1
1/3

సీఎం సారూ.. స్పందించాలి మీరు!

సీఎం సారూ.. స్పందించాలి మీరు!2
2/3

సీఎం సారూ.. స్పందించాలి మీరు!

సీఎం సారూ.. స్పందించాలి మీరు!3
3/3

సీఎం సారూ.. స్పందించాలి మీరు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement