ఇందిరాగాంధీ ఆశయ సాధనకు పాటుపడుదాం
వేములవాడఅర్బన్: ఇందిరాగాంధీ ఆశయ సాధనకు పాటుపడుదామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం వేములవాడలో మహంకాళి చౌరస్తా వద్ద కాంగ్రెస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరాగాంధీ జయంతోత్సవాలకు సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఇందిరాగాంధి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి ఆర్పించారు. పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేశ్, చిలుక రమేశ్, కూరగాయల కొమురయ్య, సాగరం వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలి
సిరిసిల్ల: ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలను అర్థమయ్యేలా వివరించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో తెలంగాణ సాంస్కృతిక కళాకారులతో కళాయాత్ర వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ, ప్రజా విజయోత్సవాలను ఈ నెల19 నుంచి డిసెంబరు 7 వరకు జిల్లాలోని సిరిసిల్ల, వే ములవాడ మున్సిపాలిటీలు, 13 మండలా ల్లోని ఆయా గ్రామాల్లో వివరించాలన్నారు. అ దనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, డీపీఆర్వో వి.శ్రీధర్, కళాకారులు పాల్గొన్నారు.
అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలి
వేములవాడఅర్బన్: సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. మంగళవారం వేములవాడ పోలీస్ స్టేషన్‌లో మాట్లాడారు. బందోబస్తులో వివిధ జిల్లాల నుంచి సుమారు 1,100 మంది పోలీసులు పాల్గొంటారని తెలిపారు. సిబ్బంది తప్పనిసరిగా ఐడీ కార్డులు ధరించి తమకు కేటాయించిన విధులను అప్రమత్తతో నిర్వహించాలన్నారు. హెలిప్యాడ్ వద్ద విధులు నిర్వహించేవారు అలర్ట్‌గా ఉండాలని సూచించారు. డ్యూటీ పరంగా ఏదైనా సందేహం ఉంటే సంబంధిత అధికారులను అడిగి తెలుసుకోవాలన్నారు. సమావేశంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. కాగా గుడి చెరువు పార్కింగ్ స్థలంలో సీఎం సభ ప్రాంగణాన్ని మల్టీజోన్– 1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి మంగళవారం రాత్రి పరిశీలించారు.
దరఖాస్తుల ఆహ్వానం
సిరిసిల్లకల్చరల్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రకటనలో తెలిపారు. తాత్కాలిక కాంట్రాక్ట్ పద్ధతిన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు కళాశాల వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకుని విద్యార్హతల జిరాక్స్ ప్రతులు జత చేసి ఈ నెల 25లోపు కళాశాలలో సమర్పించాలన్నారు. http://gmcrajannasircilla.org వెబ్‌సైట్ ద్వారా అప్లికేషన్లు డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.
అంగన్‌వాడీ కేంద్రాన్ని తెరవాలి
సిరిసిల్లటౌన్: టీచర్, ఆయాలను కేటాయించకుండా చిన్నబోనాలలో మూసేసిన అంగన్‌వాడీ సెంటర్‌ను వెంటనే తెరిపించాలని బీజేపీ ఫ్లోర్‌లీడర్, కౌన్సిలర్ బొల్గం నాగరాజుగౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం అంగన్‌వాడీ సెంటర్ ఎదుట గ్రామస్తులతో కలిసి ధర్నా చేశారు. గర్భిణులు, పిల్లలు, కిశోర బాలికలకు ప్రభుత్వ పరంగా పౌష్టికాహారం అందించేందుకు వెంటనే అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించాలని చేశారు.
Comments
Please login to add a commentAdd a comment