వ్యర్థాల శాంపిళ్లు సేకరణ | - | Sakshi
Sakshi News home page

వ్యర్థాల శాంపిళ్లు సేకరణ

Published Thu, Nov 21 2024 12:14 AM | Last Updated on Thu, Nov 21 2024 12:14 AM

వ్యర్

వ్యర్థాల శాంపిళ్లు సేకరణ

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): జిల్లాలోని రైస్‌మిల్లులు కాలుష్య కారకాలుగా మారడంతో వాటి నుంచి వస్తున్న వ్యర్థాలతో రైతులు పంటల దిగుబడి కోల్పోతుండగా, పర్యావరణ శాఖ అధికారులు బుధవారం రంగంలోకి దిగి వ్యర్థాల నమూనాలను సేకరించారు. ఈ నెల 6న ‘సాక్షి’లో ‘మిల్లులు.. రైతులకు కన్నీళ్లు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల్లో నిబంధనలకు వ్యతిరేకంగా అనేక రైస్‌మిల్లులను పంటపొలాల మధ్య ఏర్పాటు చేశారు. రైస్‌మిల్లుల తనిఖీల పేరుతో మిల్లర్ల వద్ద స్థానిక అధికారులు లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో మిల్లర్లు అధికారుల అండతో మిల్లుల పక్కనే బావులు తవ్వి వాటిలోకి వ్యర్థాలను వదులుతున్నారు. ఆ వ్యర్థాల నీరు పక్కన ఉన్న పొలాల్లోకి వెళ్లి పంటలు దెబ్బతింటున్నాయి. రైతుల సమక్షంలో వ్యర్థాల శాంపిళ్లు సేకరించామని, వాటిని ల్యాబ్‌కు పంపిస్తామని పర్యావరణ ఇంజినీర్‌ బిక్షపతి తెలిపారు. రిపోర్ట్‌ ఆధారంగా రైస్‌మిల్లులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆయన వెంట సిబ్బంది కనకాజ్యోతి, వీరేశ్‌ ఉన్నారు.

పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం

సిరిసిల్లటౌన్‌: పోరాటాలతోనే కార్మికులు, కర్షకుల సమస్యలు పరిష్కారమవుతాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పాలడుగు భాస్కర్‌ పిలుపునిచ్చారు. బుధవారం సిరిసిల్లలో పార్టీ మూడవ జిల్లా మహాసభల్లో మాట్లాడారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ ఇందిరమ్మ ఇండ్లు, మహిళకు రూ.2,500 పెన్షన్‌ వంటి ఎన్నో హామీలిచ్చి ఇప్పుడు తుంగలో తొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం పేదలను దోచి బడా కార్పొరేట్లకు పెడుతుందని విమర్శించారు. రాబోయే రోజుల్లో నేత కార్మికుల వర్కర్‌ టు ఓనర్‌ పథకం అమలు, ఇందిరమ్మ ఇండ్లు, తదితర సమస్యలపై విస్తృత పోరాటాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.స్కైలాబ్‌బాబు, జిల్లా కార్యదర్శి మూశం రమేశ్‌, నాయకులు కోడం రమణ, ఎగమంటి ఎల్లారెడ్డి, గన్నారపు నర్సయ్య, జువ్వాజి విమల, మల్లారపు అరుణ్‌కుమార్‌, ఎర్రవెల్లి నాగరాజు, సూరం పద్మ తదితరులు పాల్గొన్నారు.

ముందస్తు అరెస్టులు.. మిన్నంటిన నిరసనలు

సిరిసిల్లటౌన్‌: ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాల ఆగ్రహం పెల్లుబికింది. బుధవారం వేములవాడకు సీఎం రేవంత్‌రెడ్డి రావడంతో మంగళవారం రాత్రి నుంచే ప్రతిపక్షాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం వేకువజామునే బీఆర్‌ఎస్‌ నేతల ఇళ్లకు వెళ్లి ఠాణాకు తరలించారు. ఈసందర్భంగా వారు పోలీస్టేషన్‌లోనే ధర్నాకు దిగారు. ప్రజల ఆకాంక్షను సీఎం దృష్టికి తీసుకెళ్లకుండా పోలీసులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, గూడూరి ప్రవీణ్‌, బొల్లి రామ్మోహన్‌, అన్నారం శ్రీనివాస్‌, గుండ్లపెల్లి పూర్ణచందర్‌, సుంకపాక మనోజ్‌,

సబ్బని హరీశ్‌ తదితరులున్నారు.

సభకు పాస్‌లిచ్చి.. అరెస్టులు

సీఎంను కలిసి తమ సమస్యలు విన్నవించేందుకు అవకాశమివ్వాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ను ముందస్తుగానే కోరగా ఆయన సమ్మతించారని, సభకు వచ్చేందుకు తమకు పాస్‌లు కూడా ఇచ్చారని, కానీ పొద్దున్నే పోలీసులు అరెస్టు చేశారని తాజా మాజీ సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజా మాజీ సర్పంచుల ఫోరం జిల్లా కన్వీనర్‌ అక్కెనపల్లి కరుణాకర్‌తో పాటు పలువురిని అరెస్టులు చేయడంతో జిల్లా అంతటా ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ నేతలు ఆడెపు రవీందర్‌, గౌడ వాసుతో పాటు పలువురు వస్త్ర పరిశ్రమకు చెందిన నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
వ్యర్థాల శాంపిళ్లు సేకరణ
1
1/3

వ్యర్థాల శాంపిళ్లు సేకరణ

వ్యర్థాల శాంపిళ్లు సేకరణ
2
2/3

వ్యర్థాల శాంపిళ్లు సేకరణ

వ్యర్థాల శాంపిళ్లు సేకరణ
3
3/3

వ్యర్థాల శాంపిళ్లు సేకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement