సోమవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

సోమవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2025

Published Mon, Jan 27 2025 6:41 AM | Last Updated on Mon, Jan 27 2025 6:40 AM

సోమవా

సోమవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2025

పోలీస్‌ గౌరవ వందనం స్వీకరిస్తున్న కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా, ఆకట్టుకున్న విద్యార్థుల నృత్య ప్రదర్శన

మున్సిపల్‌ ప్రత్యేక పాలన అధికారిగా కలెక్టర్‌

సిరిసిల్లటౌన్‌: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సి రిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల ఇన్‌చార్జి ప్రత్యేక పాలనాధికారిగా జిల్లా కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా నియమితులయ్యారు. మున్సిపల్‌ పాలకవర్గాల పదవీకాలం ఈనెల 26వ తేదీతో ముగియడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం రాత్రి ము న్సిపాలిటీలకు ఇన్‌చార్జి పాలన అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా స్థానికసంస్థల అడిషనల్‌ కలెక్టర్‌ లేకపోవడంతో ఆ బాధ్యతలను జిల్లా కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా చేపట్టనున్నారు. పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో ఇకపై కొత్త పాలకవర్గం కొలువుదీరే వరకు ప్రత్యేకాధికారి పాలన కొనసాగనుంది.

ముందుజాగ్రత్తలతో దొంగతనాలకు చెక్‌

సీఐ వెంకటేశ్వర్లు

రుద్రంగి(వేములవాడ): ముందుజాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దొంగతనాలను అడ్డుకోవచ్చని చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. రుద్రంగి మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. అపరిచిత వ్యక్తుల రాక గురించి ముందస్తుగా హెచ్చరించే యాంటీ తెఫ్ట్‌ లాక్స్‌ గురించి వివరించారు.

హెల్త్‌క్యాంపు అడ్డుకున్న నాయకులు

వీర్నపల్లి(సిరిసిల్ల): మండల కేంద్రంలో ఆదివారం లేబర్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్త్‌క్యాంప్‌ను సీఐటీయూ నాయకులు అడ్డుకున్నారు. వారు మాట్లాడుతూ లేబర్‌కార్డులు ఉన్న వారికి హెల్త్‌క్యాంపు నిర్వహిస్తూ.. లేబర్‌ వెల్ఫేర్‌బోర్డులోని నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో కార్మికుని పేరిట వెల్ఫేర్‌బోర్డు నుంచి రూ.3500 నిర్వాహకులు తీసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కార్మికశాఖమంత్రిని ఏర్పాటు చేసి నిధులు సద్వినియోగం అయ్యేలా చూడాలని కోరారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగుమంటి ఎల్లారెడ్డి, ప్రజాసంఘాల జిల్లా నాయకులు మల్లారపు అరుణ్‌కుమార్‌, నాయకులు రాజేశం, నర్సయ్య, నరేందర్‌, రాజెల్లయ్య పాల్గొన్నారు.

క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయి

జడ్జీలు లక్ష్మణాచారి, జ్యోతిర్మయి

వేములవాడ: క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని వేములవాడ సీనియర్‌ సివిల్‌ జడ్జి లక్ష్మణాచారి పేర్కొన్నారు. బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడాపోటీల్లోని విజేతలకు ఆదివారం జూనియర్‌ సివిల్‌ జడ్జి జ్యోతిర్మయితో కలసి బహుమతులు అందజేశారు. వారు మాట్లాడుతూ ఏటా బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో క్రీడలు నిర్వహించుకోవడం మంచి సంప్రదాయమన్నారు. అధ్యక్షుడు గుడిసె సదానందం, ప్రధాన కార్యదర్శి రజనీకాంత్‌, క్రీడల కార్యదర్శి నాగుల సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

వేడుకలకు హాజరైన అతిథులు, జిల్లా అధికారులు

పోలీస్‌ వందనం స్వీకరిస్తున్న ఎస్పీ అఖిల్‌మహాజన్‌

పెండింగ్‌ సాగునీటి ప్రాజెక్టుల పూర్తి

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను ఏడాదిలోగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పరిధిలోని ప్యాకేజీ–9, 10, 11, 12 పనులు పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే(సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే)కు శ్రీకారం చుట్టిందని, జిల్లా వ్యాప్తంగా 1,531 ఎన్యుమరేషన్‌ బ్లాక్‌ల పరిధిలో వందశాతం 1,92,432 ఇండ్లు సర్వే పూర్తి చేశామన్నారు. 248 కొనుగోలు కేంద్రాల ద్వారా 37,398 మంది రైతుల నుంచి 2.11లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించి, రూ.490 కోట్లు జమ చేసినట్లు వివరించారు. సన్నరకం ధాన్యానికి 1200 మంది రైతులకు రూ.3.8కోట్లు బోనస్‌గా చెల్లించినట్లు తెలిపారు. ప్రతీ సోమవారం ప్రజావాణిలో విన్నపాలు స్వీకరించి, పరిష్కరిస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటికే 400 మందికి కాటమయ్య కిట్లు అందించామని, మత్య్స పారిశ్రామిక సహకార సంఘాల పరిధిలోని 440 చెరువుల్లో ఉచితంగా 43.69 లక్షల చేప పిల్లలను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. గ్రామీణ రోడ్లకు పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా రూ.18 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఆర్ధిక పునరావాసం కింద దివ్యాంగులు, ట్రాన్స్‌ జెండర్లకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌ బంక్‌ నిర్మించగా, జిల్లా అధికార యంత్రాంగం ఆద్వర్యంలో 24 మంది దివ్యాంగులు, ట్రాన్స్‌ జెండర్లు ఉపాధి పొందుతున్నారు. 322 మంది దివ్యాంగులకు 674 సహాయ ఉపకరణాలు పంపిణి చేయడం జరిగిందన్నారు.

యువత ఉపాధికి జాబ్‌మేళాలు

యువతకు ఉపాధి, ఉద్యోగాల కల్పనకు జిల్లాలో 12 జాబ్‌మేళాలు నిర్వహించి 1,500 మంది నిరుద్యోగులకు ప్రైవేటురంగంలో ఉపాధి కల్పించామని, జిల్లాలో 136 మంది స్కూల్‌ అసిస్టెంట్‌, ఎస్జీటీ, బాషా పండితులు, పీఈటీల పోస్ట్‌లు, గ్రూప్‌–4 కింద 124 మంది పోస్ట్‌లు భర్తీ చేసినట్లు వివరించారు.

సిరిసిల్ల: అభివృద్ధి పనులు.. సంక్షేమ పథకాలను ప్రజాప్రభుత్వం నిరంతరం అందిస్తోందని జిల్లా కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా పేర్కొన్నారు. జిల్లా పోలీస్‌ ఆఫీస్‌(డీపీవో)లో ఆదివారం 76వ గణతంత్ర వేడుకల సందర్భంగా ఎస్పీ అఖిల్‌మహాజన్‌తో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీస్‌ గౌరవవందనం స్వీకరించారు. కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా మాట్లాడారు. జిల్లాలో నేటి నుంచి రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకం, నూతన రేషన్‌ కార్డులు అందజేస్తున్నట్లు తెలిపారు. 44,620 మంది రైతులకు రూ.352.74 కోట్లు రుణమాఫీ జరిగిందని పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకంలో జిల్లాలో రూ.73.41 కోట్ల విలువైన కోటి 95 లక్షల మంది మహిళలు జీరో టికెట్లపై ప్రయాణించారని, మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యంగా ‘ఇందిరా మహిళాశక్తి’ పేరుతో పథకానికి ప్రజాపభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఇప్పటి వరకు మన జిల్లాలో మూడు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభించుకున్నామని, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ సరఫరా చేస్తున్నామని, జిల్లాలో ఇప్పటి వరకు 93,104 కుటుంబాల బ్యాంక్‌ ఖాతాల్లో రూ.7.35కోట్ల సబ్సిడీ సొమ్మును జమచేసినట్లు వివరించారు. గృహజ్యోతి పథకంలో మార్చి 1, 2024 నుంచి డిసెంబర్‌ 2024 వరకు 9,44,834 జీరో బిల్లులు జారీ చేసి రూ.36.36కోట్లను ప్రభుత్వం చెల్లించిందన్నారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

జిల్లాలోని వివిధ పాఠశాలల చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. దేశభక్తిని, జాతీయభావాన్ని పెంచే గీతాలతో ఆకట్టుకున్నారు. చిన్నారుల నృత్యాలు అలరించాయి. ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, అదనపు కలెక్టర్‌ ఎన్‌. ఖీమ్యానాయక్‌, అదనపు ఎస్పీ చంద్రయ్య, వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ నాగుల సత్యనారాయణగౌడ్‌, సిరిసిల్ల ఇన్‌చార్జి ఆర్డీవో రాధాబాయి, సిరిసిల్ల తహసీల్దార్‌ ఉమారాణి, కలెక్టర్‌ తల్లిదండ్రులు, ఎస్పీ సతీ మణి, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు వేడుకల్లో పాల్గొన్నారు.

రూ.900 కోట్లతో అభివృద్ధి పనులు

వేములవాడలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. రూ.900 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేస్తున్నామని, ఇందులో రూ.75కోట్లతో శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారని చెప్పారు. ప్రభుత్వ దవాఖానాల్లో వైద్యసహాయాన్ని రూ.5లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచామని, చందుర్తి, పెద్దలింగాపూర్‌లలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా 13,861 మంది రోగులకు రూ.33.63 కోట్ల విలువైన వైద్యసేవలు అందించినట్లు తెలిపారు. సిరిసిల్లలోని నేతన్నలకు నేతన్న పొదుపు, నేతన్న భరోసా, నేతన్న భద్రత పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. వస్త్ర ఆర్డర్‌ బకాయిలు రూ.379.85 కోట్లు చెల్లించామని వివరించారు. 66 లక్షల మీటర్ల ఆర్వీఎం క్లాత్‌ ఆర్డర్‌ కేటాయించామని, రూ.50కోట్లతో ఏర్పాటు చేసిన యార్న్‌బ్యాంక్‌ విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు. స్వశక్తి సంఘాల్లోని మహిళలకు ఒకే రకమైన 4.56 కోట్ల మీటర్ల చీరల ఉత్పత్తి ఆర్డర్‌ నేతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం అందించిందని తెలిపారు. ఐటీఐలను అడ్వాన్స్‌డ్‌ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని 546 ప్రభుత్వ విద్యాసంస్థల్లో 50,346 మంది విద్యార్థులు చదువుతున్నారని, 13 కేజీబీవీల్లో 3వేలకు పైగా విద్యార్థులకు ఐఐటీ, నీట్‌ ఫౌండేషన్‌ కోర్సు, ఎంసెట్‌ ఇతర పోటీపరీక్షల్లో శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. కామన్‌ డైట్‌ ద్వారా నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు.

మిడ్‌మా‘నీటి’లో జాతీయ జెండా

దేశభక్తిని చాటుకున్న మత్స్యకారులు

వేములవాడఅర్బన్‌: గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని ముదిరాజ్‌ మత్స్యకారులు తమ దేశభక్తిని చాటుకున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా మిడ్‌మానేరు ప్రాజెక్ట్‌ బ్యాక్‌వాటర్‌లో ముంపునకు గురైన కొడుముంజ పాత గ్రామపంచాయతీ భవనంపై ఆదివారం జాతీయజెండాను ఆవిష్కరించారు. మిడ్‌మానేరు నీటిలోకి తెప్పలపై వెళ్లిన ముదిరాజ్‌ కులస్తులు జాతీయజెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకున్నారు. ముదిరాజ్‌ సంఘం అధ్యక్షుడు రేగుల పర్శరాములు, రాగుల ప్రశాంత్‌, శ్రీనివాస్‌, మధు తదితరులు ఉన్నారు.

మందకృష్ణ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న నాయకులు

సిరిసిల్లటౌన్‌: మందకృష్ణకు పద్మశ్రీ అవార్డు రావడంపై సిరిసిల్లలో ఆదివారం ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్‌ ఎఫ్‌ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద స్వీట్లు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ ముప్పై ఏళ్ల ఉద్యమాన్ని నలభై ఏళ్ల ప్రజాజీవితంలో నిస్వార్థంగా సేవచేసిన మందకృష్ణకు పద్మశ్రీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర నాయకులు ఆవునూరి ప్రభాకర్‌, అంబేడ్కర్‌ సంఘాల జిల్లా అధ్యక్షుడు కత్తెర దేవదాసు, ఎంఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు కానాపురం లక్ష్మణ్‌, జిల్లా అధికార ప్రతినిధి గుండ్రేడ్డి రాజు, జిల్లా కన్వీనర్‌ ఎలగందుల భిక్షపతి, సావనపెల్లి రాకేశ్‌, నేరెళ్ల శ్రీనివాస్‌, పసుల భేష్‌కుమార్‌ పాల్గొన్నారు.

లబ్ధిదారులకు పత్రాలు అందజేస్తున్న ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

వేములవాడఅర్బన్‌: అర్హులందరికీ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అందజేస్తామని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. వేములవాడ అర్బన్‌ మండలం శాభాష్‌పల్లిలో రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, నూతన రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. లబ్ధిదారులకు ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ చేతుల మీదుగా మంజూరుపత్రాలు అందజేశారు. ప్రభుత్వ విప్‌ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. ఇంకా అర్హులు దరఖాస్తు చేసుకోకుంటే సంబంధిత కార్యాలయాల్లో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. జిల్లా ఆడిట్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌, వేములవాడ ఎంపీడీవో రాజీవ్‌ మల్హోత్ర, పార్టీ మండలాధ్యక్షుడు పల్లి కనకయ్య, మాజీ సర్పంచ్‌ పండుగ ప్రదీప్‌, ఎర్రం రాజు, గాలిపెల్లి స్వామి పాల్గొన్నారు.

రాజన్నకు జనజాతర

వేములవాడ: రాజన్నను ఆదివారం 30వేల మంది భక్తులు దర్శించుకున్నారు. ధర్మగుండంలో స్నానాలు చేసిన భక్తులు కల్యాణాలు, సత్యనారాయణ వ్రతాలు, అమ్మవారికి కుంకుమపూజ మొక్కులు చెల్లించుకున్నారు.

న్యూస్‌రీల్‌

ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
సోమవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 20251
1/18

సోమవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2025

సోమవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 20252
2/18

సోమవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2025

సోమవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 20253
3/18

సోమవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2025

సోమవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 20254
4/18

సోమవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2025

సోమవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 20255
5/18

సోమవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2025

సోమవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 20256
6/18

సోమవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2025

సోమవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 20257
7/18

సోమవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2025

సోమవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 20258
8/18

సోమవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2025

సోమవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 20259
9/18

సోమవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2025

సోమవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 202510
10/18

సోమవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2025

సోమవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 202511
11/18

సోమవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2025

సోమవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 202512
12/18

సోమవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2025

సోమవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 202513
13/18

సోమవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2025

సోమవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 202514
14/18

సోమవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2025

సోమవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 202515
15/18

సోమవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2025

సోమవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 202516
16/18

సోమవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2025

సోమవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 202517
17/18

సోమవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2025

సోమవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 202518
18/18

సోమవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement