చరిత్రకు సాక్ష్యం.. భీమునిమల్లారెడ్డిపేట | - | Sakshi
Sakshi News home page

చరిత్రకు సాక్ష్యం.. భీమునిమల్లారెడ్డిపేట

Published Tue, Jan 28 2025 12:05 AM | Last Updated on Tue, Jan 28 2025 12:05 AM

చరిత్

చరిత్రకు సాక్ష్యం.. భీమునిమల్లారెడ్డిపేట

గంభీరావుపేట(సిరిసిల్ల): చుట్టూ ఎత్తయిన కొండలు.. జలజల పారే సెలయేరు.. ఎన్నటికీ ఎండని కొలను.. తొమ్మిది అడుగుల ఏకశిల విగ్రహం.. ఇంతటి ప్రకృతి రమణీయ దృశ్యాలు వీక్షించాలంటే గంభీరావుపేట మండలం భీమునిమల్లారెడ్డిపేటకు వెళ్లాల్సిందే. మల్లారెడ్డిపేట శివారులో ఎత్తయిన గుట్టపై వెలసిన వీరాంజనేయస్వామి కోరిన కోరికలు నెరవేర్చే ఇలవేల్పుగా మొక్కులు అందుకుంటున్నారు. ఈ ఆలయ ఆవరణలో సీతారాములు, శ్రీవేంకటేశ్వస్వామి ఆలయాలు ఉన్నాయి.

● పాండవులు వనవాస సమయంలో భీముడు ఈ ప్రాంతంలో తిరిగినట్టు స్థల పురాణం చెబుతుంది. పాండవులు గుట్టలవద్ద శిర్రగోనె ఆడుతుండగా రెండు బండరాళ్ల మధ్య పడిన శిర్రను బయటకు తీయడానికి భీముడు నెత్తితో ఎత్తిన గుహ, ఆయన పాదాల ముద్రలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి.

● మానేరు నది మల్లారెడ్డిపేటలో రెండు పాయలుగా విడిపోయింది. 5వేల ఏళ్ల క్రితం ఇక్కడే మాండవ్య మహాముని తపస్సు చేయడంతో మాండవ్య నదిగా పిలిచేవారని.. అదే కాలక్రమంలో మానేరునదిగా స్థిరపడిపోయిందని పెద్దలు చెబుతుంటారు.

● 11వ శతాబ్దంలో చాళక్యుల ఆధ్వర్యంలో ఇక్కడ ఆలయాలు నిర్మించారు.

ముడుపులు కడతారు

మల్లారెడ్డిపేటలోని శ్రీవీరాంజనేయస్వామి క్షేత్రానికి మంగళ, శనివారాల్లో భక్తులు వచ్చి తమలపాకు, వడమాలలు వేస్తారు. సంతానం కోసం ముడుపులు కడతారు.

– కమలాకర్‌శర్మ, ఆలయ పూజారి,

భీమునిమల్లారెడ్డిపేట

No comments yet. Be the first to comment!
Add a comment
చరిత్రకు సాక్ష్యం.. భీమునిమల్లారెడ్డిపేట1
1/1

చరిత్రకు సాక్ష్యం.. భీమునిమల్లారెడ్డిపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement