అర్జీలు పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

అర్జీలు పరిష్కరించండి

Published Tue, Jan 28 2025 12:05 AM | Last Updated on Tue, Jan 28 2025 12:05 AM

అర్జీ

అర్జీలు పరిష్కరించండి

సిరిసిల్లటౌన్‌: ప్రజావాణిలో వచ్చే అర్జీలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సందర్భంగా మాట్లాడారు. కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా, అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 152 దరఖాస్తులు వచ్చాయి.

విన్నపాలు ఇలా..

● ఆశవర్కర్‌గా నియమించాలని ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌కు చెందిన బోదస్‌ లక్ష్మి కోరారు. తాను ఏఎన్‌ఎం కోర్సు పూర్తి చేసి పదేళ్లు ప్రైవేటు ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేసినట్లు పేర్కొన్నారు.

● దివ్యాంగుల పెట్రోల్‌బంక్‌లో ఉపాధి కల్పించాలని ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌కు చెందిన గొట్టె యశ్వంత్‌ కోరాడు. పుట్టు దివ్యాంగుడైన తనకు 90శాతం వైకల్యం ఉందని, ఆసరా పింఛన్‌తోనే బతుకుతున్నానని, కలెక్టర్‌ స్పందించి తనకు ఉపాధి చూపెట్టాలని విన్నవించారు.

కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా

పంటరుణం మాఫీ కాలేదు

మా ఊరి నుంచి ఎనిమిది మంది రైతులకు పంట రుణమాఫీ కాలేదు. జిల్లా కలెక్టర్‌ ఈ విషయంలో చొరవచూపాలి. మా గ్రామ రైతులకు పంటరుణం మాఫీ కోసం ప్రభుత్వానికి సిఫారసు చేయాలి.

– నర్సింగపూర్‌ రైతులు, బోయినపల్లి

కోతుల బెడద తీర్చాలి

సిరిసిల్ల పరిధిలోని పెద్దూరులో కోతుల బెడద ఎక్కువగా ఉంది. ఇండ్ల పైకప్పులు పీకేస్తున్నాయి. ఇండ్లలోకి చొరబడి దాడులు చేస్తున్నాయి. గతంలో కూడా ఫిర్యాదు చేశాం. కలెక్టర్‌ సార్‌ స్పందించి కోతుల సమస్య పరిష్కరించాలి. – పెద్దూరు గ్రామస్తులు

వృద్ధురాలికి కలెక్టర్‌ బాసట

ప్రజావాణికి వచ్చి నడవలేక ఇబ్బంది పడుతున్న సిరిసిల్లకు చెందిన వృద్ధురాలు మే రుగు విజయకు కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా బాసటగా నిలిచారు. తక్షణమే జిల్లా సంక్షేమాధికారితో మాట్లాడి వీల్‌చైర్‌ అందించారు.

కబ్జా భూములు స్వాధీనం చేసుకోవాలి

తంగళపల్లి మండలం మండెపల్లిలో 50 ఏళ్ల క్రితం దళిత కుటుంబాలకు ప్రభుత్వం భూమిని కేటాయించింది. అయితే 2004లో కాస్తులో లేరని ప్రభుత్వ ఆ భూమిని వెనక్కి తీసుకోగా.. కొందరు కబ్జా చేశారు. మండెపల్లి శివారులోని సమ్మక్క–సారలమ్మ గుడి సమీపంలో ఉన్న భూములను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
అర్జీలు పరిష్కరించండి1
1/4

అర్జీలు పరిష్కరించండి

అర్జీలు పరిష్కరించండి2
2/4

అర్జీలు పరిష్కరించండి

అర్జీలు పరిష్కరించండి3
3/4

అర్జీలు పరిష్కరించండి

అర్జీలు పరిష్కరించండి4
4/4

అర్జీలు పరిష్కరించండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement