విద్యతోనే జీవితంలో ఉన్నత స్థితి
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ● ఐఐటీ జేఈఈ, నీట్ ఆన్‌లైన్ తరగతులు ప్రారంభం
ఇల్లంతకుంట(మానకొండూర్): విద్యతోనే జీవితంలో ఉన్నతస్థితికి చేరుకుంటామని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా పేర్కొన్నారు. ఇల్లంతకుంట మండలంలోని కేజీబీవీలో ఐఐటీ జేఈఈ, నీట్ ఆన్‌లైన్ తరగతులను మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్థికంగా లేని కుటుంబాల పిల్లలే ఇక్కడ ఉన్నారని, మీరంతా బాగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ పేదరికంలో పుట్టిన అనేకమంది విద్యతోనే ఉన్నత స్థానాలకు చేరుకున్నారన్నారు. ఈసందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యేలు విద్యార్థులకు మ్యాథ్స్, సైన్స్‌కు సంబంధించిన ప్రశ్నలు అడుగుతూ సమాధానాలు రాబట్టారు. జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, జిల్లా విద్యాధికారి జగన్మోహన్‌రెడ్డి, జీసీడీవో పద్మజ, ఎంపీడీవో శశికళ, కేజీబీవీ ప్రిన్సిపాల్ శిరీష, డీటీ సత్యనారాయణ, ఎంఈవో శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
రైతులకు సేవలందించాలి
సిరిసిల్లకల్చరల్: రైతులకు అందుబాటులో ఉంటూ ఉత్తమ సేవలందిందించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా ఆదేశించారు. వ్యవసాయ అధికారులతో సమీక్షించి, పలు సూచనలు చేశారు. రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. డీఏపీ ఇతర ఎరువుల నిర్వహణపై జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగంను అడిగి తెలుసుకున్నారు. ఏడీఏ రామారావు, ఆయా మండలాల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలి
సిరిసిల్ల: ఇంటర్మీడియెట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్‌తో కలిసి సమీక్షించారు. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభమవుతున్నాయని, ఉదయం, మధ్యాహ్నం నిర్ధేశిత సమయాల్లో నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు. మార్చి 5 నుంచి పబ్లిక్ పరీక్షలు మొదలవుతాయని జిల్లాలో ఈసారి 9,310 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. వీరికోసం 16 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష సమయానికి గంట ముందే కేంద్రానికి చేరుకునేలా విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. సెంటర్‌లలో నిరంతరం విద్యుత్ సరఫరా జరిగేలా చూడాలన్నారు. ఇంటర్మీడియెట్ నోడల్ అధికారి శ్రీనివాస్, డీఈవో జగన్‌మోహన్‌రెడ్డి, డీఎంహెచ్‌వో రజిత, ఆర్టీసీ, సెస్, పోస్టల్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment