రాష్ట్రంలో ఎంఐఎందే సూపర్ పవర్
● కరీంనగర్ కార్పొరేషన్‌పై పార్టీ జెండా ఎగురవేస్తాం
● నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్
విద్యానగర్(కరీంనగర్): రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎంఐఎందే సూపర్ పవర్ అని ఆ పార్టీ నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ అన్నారు. కరీంనగర్‌లోని ఎంఐఎం కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు విభజించు.. పాలించు సిద్ధాంతాన్ని పాటిస్తున్నాయని ఆరోపించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ దేశంలోని పేదల పక్షాన పార్లమెంట్లో అధికార పక్షాన్ని నిలదీస్తున్నారని పేర్కొన్నారు. గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గంలో బీజేపీ మట్టికరవడంలో ఎంఐఎంది కీలకపాత్ర అని తెలిపారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 25 స్థానాల్లో పార్టీ పోటీ చేస్తుందని, ఇక్కడ ఎంఐఎం జెండా ఎగురవేస్తామన్నారు. అనంతరం సాలారే మిల్లత్ ఆల్ ఇన్ వన్–2025 బుక్స్‌ను ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఉర్దూ మీడియం పదోతరగతి విద్యార్థులకు పంపిణీ చేశారు. మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, పార్టీ నగర అధ్యక్షుడు గులాం అహ్మద్ హుస్సేన్, ప్రధాన కార్యదర్శి బర్కత్ అలీ, మాజీ కార్పొరేటర్లు అఖిల్ ఫిరోజ్, శర్ఫుద్దీన్, నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment