రూ.కోటి దాటిన కొండగట్టు అంజన్న ఆదాయం
ఇద్దరికి జైలు
వేములవాడ: పోలీసుల విధులకు ఆటంకం కల్గించిన ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్షతోపాటు తలా రూ.వెయ్యి జరిమానా విధిస్తూ వేములవాడ ప్రథమ శ్రేణి న్యాయమూర్తి జ్యోతిర్మయి గురువారం తీర్పు వెల్లడించినట్లు వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. నాగయ్యపల్లికి చెందిన రొండి శంకరయ్య, పట్టణంలోని సుభాష్‌నగర్‌కు చెందిన గుర్రం అశోక్‌లు అక్టోబర్ 14, 2017న ఓ కేసు దర్యాప్తు చేస్తుండగా ఎస్సై చిట్టిబాబు విధులకు ఆటంకం కల్గించినట్లు పేర్కొన్నారు. విచారణ అధికారి శ్రీనివాస్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా కోర్టు కానిస్టేబుల్ సురేష్ సాక్షులను ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ విక్రాంత్ కేసు వాదించారు. పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి నేరస్తులకు ఆరు నెలలు జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించినట్లు చెప్పారు.
కొండగట్టు(చొప్పదండి) కొండగట్టు అంజన్న ఆలయానికి భక్తుల ద్వారా వచ్చిన ఆదాయం రూ.కోటి దాటింది. ఆలయంలోని హుండీల ఆదాయాన్ని గురువారం అధికారులు లెక్కింపు చేపట్టారు.70రోజులకుగాను 12 హుండీలను లెక్కించగా రూ.1,15,93,291 నగదు, 55 గ్రాముల మిశ్రమ బంగారం, మూడు కిలోల మిశ్రమ వెండి, 61 విదేశీ కరెన్సీ వచ్చినట్లు ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో ఏఈఓ అంజయ్య, సూపరింటెండెంట్ సునీల్, చంద్రశేఖర్, హరిహరనాథ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment