ప్రమాదంలో బెటాలియన్ కానిస్టేబుల్ మృతి
వీర్నపల్లి(సిరిసిల్ల): నిజామాబాద్ జిల్లాలోని డిచ్‌పల్లి 7వ బెటాలియన్‌లో విధులు నిర్వహించే కానిస్టేబుల్ బుధవారం రాత్రి విధులు ముగించుకొని తన గదికి వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో మృతిచెందాడు. వీర్నపల్లి మండలం గర్జనపల్లికి చెందిన అజ్మీరా కళ్యాణ్‌నాయక్(29) డిచ్‌పల్లి బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తి న్నాడు. విధులు ముగించుకొని బుధవారం రాత్రి తాను అద్దెకు ఉంటున్న గదికి వెళ్తుండగా డిచ్‌పల్లిలోనే ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కళ్యాణ్‌నాయక్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని గురువారం స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. మృతునికి కుమారుడు, కుమార్తె, భార్య సుష్మా ఉన్నారు .
పోలీసుల అదుపులో బండపల్లి యువకుడు ?
చందుర్తి(వేములవాడ): మండలంలోని బండపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు గంజాయి రవాణాదారులతో సంబంధాలున్నాయన్న సమాచారం మేరకు ఇద్దరితోపాటు మరో నలుగురు పేర్లను గ్రామస్తులతో చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. గ్రామంలో ఓ యువకుడిని అదుపులోకి తీసుకోవడంతో గ్రామంలో ఎవరెవరి పేర్లు బయటకొస్తాయోనని చర్చ జరుగుతున్నట్లు సమాచారం.
రోడ్డు పనులు అడ్డుకున్న గ్రామస్తులు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని దుమాలలో రోడ్డు పనులను గ్రామస్తులు గురువారం అడ్డుకున్నారు. గ్రామంలోని రామిండ్ల వాడ నుంచి అక్కపల్లికి వెళ్లే దారిలో ఒక సైడ్‌కు రోడ్డును తీస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. దీనిపై కలెక్టర్ చర్యలు తీసుకొని రోడ్డు నిర్మాణ పనులపై విచారణ జరపాలని కాల నీ వాసులు కోరుతున్నారు. అప్పటివరకు నిర్మాణ పనులు జరుగకుండా అడ్డుకుంటామన్నారు.
అప్రమత్తతతో సైబర్ నేరాలకు చెక్
సిరిసిల్లక్రైం: అప్రమత్తతతోనే సైబర్ నేరాలకు చెక్ పెట్టే అవకాశం ఉందని సిరిసిల్ల టౌన్ సీఐ కృష్ణ పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నెహ్రూనగర్‌లో గురువారం మీకోసం కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నియమాలు, గల్ఫ్ ఏజెంట్ల మోసాలు, సైబర్ మోసాలు, మహిళా చట్టాలు, షీటీమ్, నూతన చట్టాలపై అవగాహన, సీసీ కెమెరాల ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. ఎవరైనా మోసపోతే 1930లో ఫిర్యాదు చేయాలని సూచించారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయొద్దని, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని సూచించారు.
కోనరావుపేట: సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు అన్నారు. మండలకేంద్రంలో గురువారం రాత్రి మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఓటీపీ, బ్యాంక్ ఖాతా వివరాలు అడిగితే చెప్పకూడదని, ఖాతానుంచి డబ్బులు డ్రా అయినట్లు మెసేజ్ వస్తే వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. యువకులు గంజాయి తదితర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. ఎసై ్స ప్రశాంత్‌రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment