అనుమానాస్పదంగా వ్యక్తి మృతి
వేములవాడఅర్బన్: వేములవాడ మున్సిపల్ పరిధి తిప్పాపూర్ మూలవాగు పక్కన గల కల్లు కాంపౌండ్‌లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు. సిద్దిపేట జిల్లా కేంద్రం రాంనగర్‌కు చెందిన సారుగు రఘు(32) వంటమాస్టర్‌గా పనిచేస్తున్నాడు. గతేడాది భార్య అమూల్యతో వ్యక్తిగత గొడవలతో ఆమె తల్లిగారి ఇంటి వద్ద ఉంటుంది. బుధవారం సాయంత్రం సిద్దిపేటకు చెందిన విక్రాంత్‌తో కలిసి వేములవాడకు వచ్చాడు. గురువారం ఉదయం కల్లు కాంపౌండ్‌లో మృతదేహం కనిపించాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయాన్ని మృతుడి భార్య అమూల్యకు తెలపడంతో ఆమె వచ్చింది. మృతదేహంపై గాయాలు ఉండడంతో అనుమానాస్పద మృతిగా మృతుని భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. సంఘటన స్థలాన్ని వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, సీఐ వీరప్రసాద్, ఎస్సై రమేశ్ పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment