అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య
మల్లాపూర్: అప్పులబాధతో మనస్తాపం చెందిన ఓ యువకుడు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని సిరిపూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మహ్మద్ ఖలీల్ పాషా (36) నాలుగేళ్లుగా ఉపాధి కోసం అప్పు చేసి గల్ఫ్ దేశాలకు వెళ్లి వస్తున్నాడు. ఇటీవలే వచ్చిన ఆయన ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో బుధవారం గ్రామశివారులోని ఎల్లమ్మగుడి సమీపంలో పురుగుల మందు తాగి కుటుంబసభ్యులకు ఫోన్ చేశాడు. వారు అతడిని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి గురువారం మృతి చెందాడు. మృతుడి భార్య రేష్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.
ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య
పెగడపల్లి: మండలంలోని దో మలకుంటకు చెందిన గీతకార్మి కుడు పచ్చిమట్ల మల్లయ్య (55) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై రవికిరణ్ తెలిపా రు. ఆయన కథనం ప్రకారం.. గీతవృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మల్ల య్య.. కుటుంబ అవసరాల నిమిత్తం తెలిసిన వారి వద్ద కొంత అప్పు చేశాడు. అప్పు చెల్లించే మార్గం లేక జీవితంపై విరక్తి చెంది గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. మల్ల య్య భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment