ఆమె జాడేది? | - | Sakshi
Sakshi News home page

ఆమె జాడేది?

Published Fri, Jan 31 2025 1:18 AM | Last Updated on Fri, Jan 31 2025 1:18 AM

ఆమె జాడేది?

ఆమె జాడేది?

● ఎమ్మెల్సీ పోటీకి ఆసక్తి చూపని మహిళా నాయకులు ● నాలుగు పాత జిల్లాల్లో 1.23 లక్షల ఓట్లు వారివే ● ఉపాధ్యాయుల ఓటర్లలో సగానికిపైగా మహిళలే ● టీచర్‌, గ్రాడ్యుయేట్లలోనూ ఉమ్మడి కరీంనగర్‌ టాప్‌ ● నామినేషన్లలోౖనైనా తెరపైకి వచ్చేనా?

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌:

రీంనగర్‌–మెదక్‌–నిజామాబాద్‌– ఆదిలాబాద్‌ జిల్లాల శాసనమండలి ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేసింది. బుధవారం మధ్యాహ్నం నుంచే కోడ్‌ అమల్లోకి వచ్చింది. గత మూడు నాలుగునెలలుగా పలువురు అభ్యర్థులు పట్టభద్రులు, ఉపాధ్యాయబరిలో పోటీ చేస్తామంటూ హడావుడి చేస్తున్నారు. భారీ బహిరంగ సభలు, ప్రకటనలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరంతా పురుషులే కావడం, ఇంతవరకూ ఒక్క మహిళా నేతైనా బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపకపోవడం గమనార్హం. వాస్తవానికి పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఓటర్ల జాబితాలో మహిళలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నారు. దాదాపు 3.4 లక్షల పట్టభద్రుల ఓటర్ల జాబితాలో 50 శాతం కంటే అధికంగా అంటే 1.2 లక్షల మంది మహిళలే. అదే విధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో మహిళల సంఖ్య అధికంగా ఉంది. మొత్తం ఓటర్లు 16 వేలకుపైగా ఉన్న మొత్తం ఓటర్లలో దాదాపు 10 వేలమంది మహిళా ఉపాధ్యాయ, అధ్యాపకులే కావడం విశేషం. అయినప్పటికీ.. రాజకీయంగా మహిళలు ఎవరూ ఇంతవరకు ముందుకు రాలేదు. వచ్చే నెల 3వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై.. 10వ తేదీన ముగియనుంది. కనీసం అప్పటికై నా మహిళా అభ్యర్థులు బరిలో ఉంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీ అందరి కంటే ముందే అభ్యర్థులను ప్రకటించింది. ఇక బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల నుంచి టికెట్‌ ఆశిస్తున్న అభ్యర్థులంతా పురుషులే. కనీసం స్వతంత్రుల్లోనూ మహిళలు ఎవరూ లేకపోవడం గమనార్హం. గత అసెంబ్లీ ఎన్ని కల సమయంలో దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీచేసిన అభ్యర్థులు ముందుజాగ్రత్తగా డమ్మీలుగా భార్యలతో నామినేషన్‌ వేయించారు. ఈసారి ఎన్నికల్లో మహిళ అభ్యర్థులు కనీసం డమ్మీలుగానైనా వస్తారా? లేదా అన్నది వేచి చూడాలి.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా టాప్‌

పట్టభద్రులు, ఉపాధ్యాయ ఓటర్ల విషయంలో ఉమ్మడి జిల్లా అగ్రభాగాన ఉంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 1.55 లక్షల ఓట్లు ఉండగా.. అందులో 61 వేల పైచిలుకు మహిళా ఓట్లు పాత జిల్లాకు చెందినవే. అందులోనూ కరీంనగర్‌ (27,992) ఓటర్లతో మొదటిస్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానా ల్లో జగిత్యాల (13,206), పెద్దపల్లి (11,638), రాజన్నసిరిసిల్ల (8,323) జిల్లాలు నిలిచాయి. అదే విధంగా ఉపాధ్యాయ ఓటర్లలో మొత్తం 16 వేల ఓటర్లలో 10 వేల వరకు మహిళలే ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 4,951 ఓట్లు ఉండగా అందులో 2,708 మహిళలే ఉన్నారు. వాటిలోనూ కరీంనగర్‌ (1,508 ఓట్లు) తొలిస్థానంలో నిలువగా, జగిత్యాల (509), పెద్దపల్లి (450), సిరిసిల్ల (241) జిల్లాలు ఆ తర్వాత స్థానాలను దక్కించుకున్నాయి.

పట్టభద్రుల ఓటర్లు ఇలా..

ఉపాధ్యాయ ఓటర్ల సంఖ్య

జిల్లా పురుషులు సీ్త్రలు మొత్తం

ఆసిఫాబాద్‌ 314 143 457

మంచిర్యాల 940 610 1550

ఆదిలాబాద్‌ 1073 488 1561

నిర్మల్‌ 1263 681 1944

నిజామాబాద్‌ 2100 1429 3529

కామారెడ్డి 1341 720 2061

జగిత్యాల 1197 509 1706

పెద్దపల్లి 609 450 1059

కరీంనగర్‌ 2512 1508 4020

రాజన్న సిరిసిల్ల 633 241 874

సంగారెడ్డి 1485 1103 2588

మెదక్‌ 766 515 1281

సిద్దిపేట 1948 1104 3052

హనుమకొండ 120 38 158

జయశంకర్‌ భూపాలపల్లి 63 18 81

మొత్తం 1,6,364 9557 2,5,921

జిల్లా పురుషులు సీ్త్రలు ఽథర్డ్‌జెండర్‌ మొత్తం

ఆసిఫాబాద్‌ 4106 1749 0 5855

మంచిర్యాల 18882 11606 0 30488

ఆదిలాబాద్‌ 10104 4482 0 14586

నిర్మల్‌ 11271 5538 0 16809

నిజామాబాద్‌ 19368 11225 0 30593

కామారెడ్డి 11228 4587 1 15816

జగిత్యాల 21075 13206 0 34281

పెద్దపల్లి 18430 11638 1 30069

కరీంనగర్‌ 41665 27992 0 69657

రాజన్న సిరిసిల్ల 13290 8323 1 21614

సంగారెడ్డి 14437 6766 0 21203

మెదక్‌ 8533 3420 0 11953

సిద్దిపేట 20922 10624 0 31546

హనుమకొండ 3055 1368 0 4423

జయశంకర్‌భూపాలపల్లి 1694 726 0 2420

మొత్తం 2,18,060 1,23,250 3 3,41,313

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement