పెండింగ్‌ పనులు పూర్తిచేయండి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ పనులు పూర్తిచేయండి

Published Fri, Jan 31 2025 1:18 AM | Last Updated on Fri, Jan 31 2025 1:18 AM

పెండింగ్‌ పనులు పూర్తిచేయండి

పెండింగ్‌ పనులు పూర్తిచేయండి

● జీజీహెచ్‌లో పేషెంట్లకు మెరుగైన సేవలు ● తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలి ● ఫిబ్రవరి 1 నుంచి స్పెషల్‌ డ్రైవ్స్‌ ● కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా

సిరిసిల్లటౌన్‌: జిల్లా జనరల్‌ ఆస్పత్రి(జీజీహెచ్‌)లో పెండింగ్‌ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి సమావేశం కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా నిర్వహించారు. పిడియాట్రిక్‌ వార్డు, పోస్టు ఆపరేటీవ్‌ వార్డు, ఓటీ వెనుక వైపు లీకేజీలు, ఎస్‌ఎన్‌సీయూలో సీలింగ్‌ మరమ్మతులు, సూపరింటెండెంట్‌ చాంబర్‌ పక్కన గల గదుల్లో పైకప్పు మరమ్మతు, ఓపీ గేట్‌–1 ముందు నుంచి ఎమర్జెన్సీ వార్డు వరకు గల ఖాళీ స్థలాన్ని ద్విచక్రవాహనాల పార్కింగ్‌, సెప్టిక్‌ట్యాంక్‌ క్లీనింగ్‌ పనులు అడిగి తెలుసుకున్నారు. అత్యవసర రోగులను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ ఆస్పత్రికి తరలింపు కోసం అడ్వాన్స్‌డ్‌ లైఫ్‌సపోర్ట్‌ అంబులెన్స్‌ ఏర్పాటు అంశాలపై చర్చించారు. క్లీనింగ్‌, ఇతర పనులు సంబంధిత శాఖల అధికారులతో చేయించాలని సూచించారు. జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లక్ష్మీనారాయణ, వైద్యకళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ లక్ష్మీనారాయణ, జిల్లా వైద్య అధికారి రజిత, వేములవాడ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.

సమ్మర్‌లో నీటి ఎద్దడి రానీయొద్దు

సమ్మర్‌లో ప్రజలకు నీటి ఎద్దడి రానీయకుండా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా ఆదేశించారు. నీటి ఎద్దడికి టోల్‌ఫ్రీ నంబర్‌ 1800–599–4007 ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. జిల్లాలో మిషన్‌ భగీరథ గ్రిడ్‌, ఇంట్రా తాగునీటి సరఫరాలో భాగంగా చేపట్టిన పనులు, ప్రస్తుతం నీటిసరఫరా జరుగుతున్న ఆవాసాలు, వాటర్‌సోర్స్‌, ఇబ్బందులు తదితర అంశాలను కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో మిషన్‌ భగీరథ తాగునీటి సరఫరాకు సంబంధించి ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు జరిగే స్పెషల్‌డ్రైవ్‌ పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. రానున్న వేసవిలో నీటి సరఫరా సమస్యలు ఎక్కడ ఉత్పన్నమవుతాయి, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నివేదిక ముందుగానే అందించాలని సూచించారు. జిల్లాకు సంబంధించి మిడ్‌మానేర్‌, అప్పర్‌ మానేర్‌ నుంచి తాగునీరు వేములవాడలోని గుర్రంవానిపల్లి 120 ఎంఎల్‌డీ, గంభీరావుపేట మండలం కోలమద్ది 7 ఎంఎల్‌డీ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ల నుంచి 300 ఆవాసాలు(271 రూరల్‌, 29 అర్బన్‌) నీటి సరఫరా జరుగుతుందన్నారు. ప్రస్తుతం 11 ఆవాసాల్లో నీటి లీకేజీలు, రైల్వే, రోడ్డు భవనాల శాఖతో మరమ్మతు గురయ్యాయని, వీటి పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మిషన్‌ భగీరథ గ్రిడ్‌ నుంచి ఆవాసాలకు బల్క్‌వాటర్‌ సప్లయ్‌ సక్రమంగా జరుగుతుందా.. ఇంట్రా పైప్‌లైన్ల ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందుతుందో.. లేదో.. స్పెషల్‌ డ్రైవ్‌లో పరిశీలించాలన్నారు. ఇన్‌చార్జి డీపీవో శేషాద్రి, మిషన్‌ భగీరథ ఇంట్రా ఈఈ జానకి, మిషన్‌ భగీరథ గ్రిడ్‌ డీఈ రాము, ఎంపీడీవోలు, ఏఈలు ఎంపీవోలు పాల్గొన్నారు.

గాంధీజీకి నివాళి

సిరిసిల్లటౌన్‌: జాతిపిత మహాత్మా గాంధీజీ వర్ధంతి సందర్భంగా కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా ఆధ్వర్యంలో అధికారులు నివాళి అర్పించారు. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రజుమంలో అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌, కలెక్టరేట్‌ ఏవో రామ్‌రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement