సిరిసిల్ల మున్సిపల్‌ కమిషనర్‌గా సమ్మయ్య | - | Sakshi
Sakshi News home page

సిరిసిల్ల మున్సిపల్‌ కమిషనర్‌గా సమ్మయ్య

Published Fri, Jan 31 2025 1:18 AM | Last Updated on Fri, Jan 31 2025 1:18 AM

సిరిస

సిరిసిల్ల మున్సిపల్‌ కమిషనర్‌గా సమ్మయ్య

● లావణ్య జీహెచ్‌ఎంసీకి బదిలీ

సిరిసిల్లటౌన్‌: సిరిసిల్ల మున్సిపల్‌ కమిషనర్‌ దుబ్బాక లావణ్య బదిలీ అయ్యారు. గురువారం వెలువడిన పలువురు కమిషనర్ల బదిలీల్లో భాగంగా ఆమెను హైదరాబాద్‌ జీహెఎంసీకి బదిలీ చేశారు. గతంలో ఆమె జీహెచ్‌ఎంసీ ఏఈవోగా పనిచేసి సిరిసిల్ల మున్సిపల్‌ కమిషనర్‌గా వచ్చారు. ప్రస్తుతం హుజూరాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న ఎస్‌.సమ్మయ్య సిరిసిల్ల మున్సిపల్‌ కమిషనర్‌గా నియమితులయ్యారు.

విద్యార్థులకు మార్గనిర్ధేశం చేయాలి

జిల్లా విద్యాధికారి జగన్‌మోహన్‌రెడ్డి

వేములవాడఅర్బన్‌: ఉపాధ్యాయులు విద్యార్థులకు చదువుతోపాటు ఉన్నత లక్ష్యాలు చేరేలా మార్గనిర్ధేశం చేయాలని జిల్లా విద్యాధికారి జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. వేములవాడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు కౌన్సిలింగ్‌, మార్గదర్శకత్వంపై గురువారం జిల్లాస్థాయి శిక్షణనిచ్చారు. రెండు రోజులపాటు శిక్షణ కొనసాగనుంది. సెక్టోరియల్‌ అధికారి శైలజ, మండల విద్యాధికారి బన్నాజీ, పాఠశాల హెచ్‌ఎం రాజారత్నం పాల్గొన్నారు.

ప్రధానితో చర్చలో పాల్గొన్న విద్యార్థికి సన్మానం

కోనరావుపేట(వేములవాడ): ప్రధాని నరేంద్రమోదీ సమక్షంలో నిర్వహించిన పరీక్ష పే చర్చలో పాల్గొన్న మండలంలోని సుద్దాలకు చెందిన విద్యార్థిని సాయితేజను గ్రామస్తులు గురువారం సన్మానించారు. స్థానిక ఉన్నత పాఠశాలకు చెందిన అలువాల సాయితేజ ఇటీవల ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీతో జరిగిన పరిక్ష పే చర్చలో పాల్గొన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు మిర్యాల్‌కార్‌ బాలాజీ, నాయకులు అంబోజి లక్ష్మీనారాయణ, జితేందర్‌, వెంకటేశం, కిషన్‌, వామన్‌, తిరుపతి పాల్గొన్నారు.

ప్రభుత్వ వస్త్ర ఉత్పత్తులపై మెరుగైన కూలి ఇవ్వాలి

సిరిసిల్లటౌన్‌: ప్రభుత్వ ఉత్పత్తులు నేసే నేతకార్మికులకు రోజుకు రూ.వేయి కూలి నిర్ణయించాలని పవర్‌లూమ్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మూశం రమేశ్‌ కోరారు. వస్త్రపరిశ్రమలోని కార్మికుల సమస్యలపై గురువారం చేనేత, జౌళిశాఖ ఆఫీసులో వినతిపత్రం అందజేసి మాట్లాడారు. వార్పిన్‌, వైపని, అనుబంధ రంగాల కార్మికులకు పెద్దపన్న 10 పిక్కులకు 35 పైసలు, చిన్నపన్న 10 పిక్కులకు 30 పైసలు ఇవ్వాలని, వార్పిన్‌ కార్మికులకు వేయి పోగులకు రూ.110, టెక్స్‌టైల్‌ పార్కులో పనిచేసే కార్మికులకు 10 పిక్కులకు 50పైసలు ఇవ్వాలని కోరారు. 2023 ఏడాదికి కార్మికులకు రావాల్సిన యారన్‌ సబ్సిడీ అందించాలని, ఇప్పుడు ఉత్పత్తి చేస్తున్న వాటికి యారన్‌ సబ్సిడీ వర్తింపజేయాలని కోరారు. కోడం రమణ, సిరిమల్ల సత్యం, కుమ్మరికుంట కిషన్‌, నక్క దేవదాసు, గుండు రమేశ్‌, కూచన శంకర్‌, కుడిక్యాల కనకయ్య పాల్గొన్నారు.

చిన్న ఆసాములకే యారన్‌

టెక్స్‌టైల్‌ శాఖ అధికారి సాగర్‌

సిరిసిల్లటౌన్‌: చేనేత, పవర్‌లూం కార్మికులు, అనుబంధ కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘చేనేత అభయహస్తం’ పథకాన్ని ప్రవేశపెట్టిందని జిల్లా టెక్స్‌టైల్‌ అధికారి సాగర్‌ తెలిపారు. గురువారం వివరాలు వెల్లడించారు. యారన్‌ డిపో ద్వారా చిన్న ఆసాములకు మాత్రమే యారన్‌ పంపిణీ చేయాలని నిర్ణయంచినట్లు తెలిపారు. ఎస్‌ఎస్‌ఐ కింద నమోదైన వారు వారి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసుకున్న ప్రతిని సెస్‌ కార్యాలయంలో అందజేస్తే 25 హెచ్‌పీ వరకు విద్యుత్‌ సబ్సిడీ వర్తిస్తుందని వివరించారు. టెక్స్‌టైల్‌ పార్క్‌లోని ర్యాపియర్‌ యూనిట్లకు సమగ్ర శిక్ష, వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్లకు అవసరమగు 46 లక్షల మీటర్ల క్లాత్‌ ఆర్డర్‌ టీజీఎస్‌సీవో ద్వారా కేటాయించినట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
సిరిసిల్ల మున్సిపల్‌  కమిషనర్‌గా సమ్మయ్య1
1/3

సిరిసిల్ల మున్సిపల్‌ కమిషనర్‌గా సమ్మయ్య

సిరిసిల్ల మున్సిపల్‌  కమిషనర్‌గా సమ్మయ్య2
2/3

సిరిసిల్ల మున్సిపల్‌ కమిషనర్‌గా సమ్మయ్య

సిరిసిల్ల మున్సిపల్‌  కమిషనర్‌గా సమ్మయ్య3
3/3

సిరిసిల్ల మున్సిపల్‌ కమిషనర్‌గా సమ్మయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement