అల్పాహారానికి నిధులొచ్చాయ్‌.. | - | Sakshi
Sakshi News home page

అల్పాహారానికి నిధులొచ్చాయ్‌..

Published Fri, Jan 31 2025 1:18 AM | Last Updated on Fri, Jan 31 2025 1:18 AM

అల్పా

అల్పాహారానికి నిధులొచ్చాయ్‌..

సిరిసిల్ల ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ విద్యాలయాల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేలా నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల సమయంలో అల్పాహారం అందించేందుకు మార్గం సుగమమైంది. సాయంత్రం విద్యార్థులకు వారంలో ఆరు రోజులపాటు వివిధ రకాలుగా అల్పాహారం అందించేందుకు విధివిధానాలు ఖరారయ్యాయి. వీటిని అందించేందుకు అవసరమైన నిధులు జిల్లా విద్యాధికారి పర్యవేక్షణలో సద్వినియోగమయ్యేలా చర్యలు తీసుకునేందుకు ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో ఇన్నాళ్లు పదోతరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల సమయంలో అల్పాహారం అందించేందుకు సంబంధిత పాఠశాల ఉపాధ్యాయులు పడిన కష్టానికి ముగింపు పడింది. పదోతరగతి విద్యార్థులకు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.

1వ తేదీ నుంచి అమలు

జిల్లాలోని జిల్లాపరిషత్‌, ఆదర్శ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మార్చి 20 వరకు అల్పాహారం అందించేందుకు జిల్లా విద్యాధికారి చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పదో తరగతి 13,217 మంది విద్యార్థులు చదువుతుండగా, వీరికి అల్పాహారం అందించేందుకు రూ.75,33,690 మంజూరయ్యాయి. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని 3,023 మంది విద్యార్థులకు రూ.17,23,110 కేటాయించారు. వీటిని విద్యార్థుల ప్రత్యేక తరగతుల నిర్వహణ సమయంలో అల్పాహారం అందించేందుకు విద్యాకమిటీ ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి పర్యవేక్షణలో సద్వినియోగం చేయాలని రాష్ట్ర ఉన్నతాధికారులు సూచించారు.

తప్పిన దాతల వెతుకులాట

పదోతరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల సమయంలో అల్పాహారం అందించేందుకు 2023లో అప్పటి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. తర్వాత విద్యాసంవత్సరం నిధులు మంజూరు చేయకపోవడంతో ఉపాధ్యాయులు దాతల సహాయంతో అల్పాహారం అందించారు. ప్రస్తుత విద్యా సంవత్సరం అధికారికంగా ప్రభుత్వం అల్పాహారానికి నిధులు మంజూరు చేయడంతో ఇబ్బందులు తప్పాయి.

సద్వినియోగం చేసుకోవాలి

విద్యార్థులకు ప్రత్యేక తరగతుల సమయంలో ఆకలి నుంచి ఉపశమనానికి అల్పాహారం అందించేందుకు ప్రభుత్వం ధులు విడుదల చేయడం శుభపరిణామం. విద్యార్థుల కోసం ప్రభుత్వం అందిస్తున్న ప్రతీ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

– జగన్మోహన్‌రెడ్డి, జిల్లా విద్యాధికారి

‘పది’ విద్యార్థులకు తీరిన ఆకలిబాధ

సాయంత్రం స్నాక్స్‌ కోసం డబ్బులు

ఒకటో తేదీ నుంచి అమలు

విద్యాధికారులకు ఆదేశాలు

స్నాక్స్‌ ఇలా..

ఉడికించిన పెసర్లు పల్లిబెల్లం

మిల్లెట్‌ బిస్కెట్స్‌ ఉడికించిన బబ్బెర్లు

ఉల్లిగడ్డ పకోడి ఉడికించిన శెనగలు

No comments yet. Be the first to comment!
Add a comment
అల్పాహారానికి నిధులొచ్చాయ్‌..1
1/1

అల్పాహారానికి నిధులొచ్చాయ్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement