● బీజేపీ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్
సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలో అక్రమ నిర్మాణాలపై బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఫిర్యాదు చేశారు. పట్టణంలోని బైపాస్‌రోడ్డులో గల ఓ బార్ అండ్ రెస్టారెంట్ బిల్డింగ్‌ను అక్రమంగా నిర్మించారని బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ ఆరోపించారు. ఈమేరకు గురువారం సిరిసిల్ల మున్సిపల్ ఆఫీసులో ఫిర్యాదు చేసి మాట్లాడారు. సదరు బిల్డింగ్ నిర్మాణం అనుమతులపై గతంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదన్నారు. బుధవారం సదరు బార్ అండ్ రెస్టారెంట్‌కు ఇచ్చిన అనుమతి ప్రకారం లేని నిర్మాణాలను తొలగించిన తర్వాతే నిర్వహణకు అనుమతులు ఇవ్వాలని కోరారు. భవన యజమానిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జ్యోతినగర్ నుంచి డంప్‌యార్డు వరకు సిరిసిల్ల గ్రామపంచాయతీ కాలం నుంచి ఉన్న రోడ్డును తిరిగి వినియోగంలోకి తేవాలని విన్నవించారు. ఈరోడ్డును ఆక్రమించి వెలసిన నిర్మాణాలను వెంటనే తొలగించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment