నారాయణఖేడ్, జహీరాబాద్, అందోల్ మండలాల్లోని వివిధ ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో పక్షం రోజులుగా ఎండ తీవ్రతతో ఉక్కపోతకు గురవుతున్న ప్రజలకు ఉపశమనం లభించింది. అకాల వర్షం కారణంగా ఆయా ప్రాంతాల్లో శనగ, జొన్న తదితర పంటలు దెబ్బతిన్నాయి. ఇక మామిడి పంటకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జహీరాబాద్ పట్టణంలోని బాగారెడ్డిపల్లిలో ఈదురుగాలులకు విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో కరెంట్ సరఫరా నిలిచిపోయియింది. న్యాల్‌కల్ మండలంలోని గంగ్వార్ చౌరస్తా వద్ద వర్షపునీరు నిలవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.
నారాయణఖేడ్/న్యాల్‌కల్ (జహీరాబాద్)/జహీరాబాద్ టౌన్/మునిపల్లి :
జిల్లాలో పలుచోట్ల అకాల వర్షం
జిల్లాలో పలుచోట్ల అకాల వర్షం