
పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
క్రికెట్ బెట్టింగ్‌లో యువత నష్టపోతుంది. క్రీడాస్ఫూర్తిని ఆస్వాదించాలి కానీ విషాదంగా మార్చుకోకూడదు. పల్లెలు, పట్టణాల్లో యువకులకు ఆశ చూపించి వారిని బెట్టింగ్ రాయుళ్లు తప్పుదోవ పట్టిస్తున్నారు. రాత్రికి రాత్రి డబ్బు సంపాదిద్దామనే పద్ధతి సరికాదు. తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు పాల్పడే వారిని తప్పుదారిలో వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
–పూర్ణ కృష్ణ, మోటివేషనల్ స్పీకర్
మానసిక ప్రశాంతతను కోల్పోతారు
బెట్టింగ్ వేయడంతో మానసిక ప్రశాంతతను కోల్పోతారు. మ్యాచ్ చూస్తున్న సమయంలో బెట్టింగ్ పోతే ఇతరులకు డబ్బులు కట్టాలనే ఆలోచనలతో మానసిక ఆందోళనకు గురవుతుంటారు. ఒక్కోసారి ప్రాణాలు తీసుకుంటుంటారు. కాబట్టి యువతే కాదు ఎవరైనా సరే బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలి.
–డాక్టర్ పరశురాం, మానసిక వైద్యులు
బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు
ఐపీఎల్‌లో బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. బెట్టింగ్ ఆడే వారిపై ప్రత్యేక నిఘా పెట్టాం. బెట్టింగ్‌లకు అలవాటు పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. పల్లెల్లో కూడా పోలీసు బృందాలు తిరుగుతున్నాయి. బెట్టింగ్ చట్టరీత్యా నేరం. జైలుకు కూడా వెళ్లాల్సి ఉంటుంది.
–పరితోష్ పంకజ్ , జిల్లా ఎస్పీ

పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి