Viral Pics: Anushka Sharma, Virat Kohli With Baby Vamika Caughted At Airport - Sakshi
Sakshi News home page

బిడ్డతో ఎయిర్‌ పోర్టులో కోహ్లీ దంపతులు.. ఫోటోలు వైరల్‌

Mar 22 2021 12:13 PM | Updated on Mar 23 2021 8:04 AM

Anushka Sharma And Virat Kohli With Daughter Vamika at Ahmedabad Airport - Sakshi

గాంధీనగర్‌: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ-అనుష్క శర్మలు ఈ ఏడాది తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. పాప పుట్టి ఇప్పటికి రెండు నెలలకు పైగానే అయినప్పటికి తనకు సంబంధించి ఇంత వరకు ఒక్క ఫోటో కూడా షేర్‌ చేయలేదు కోహ్లీ దంపతులు. బిడ్డను ఎత్తుకుని ఉన్న ఫోటోలను షేర్‌ చేశారు తప్ప.. పాప పూర్తిగా కనిపించేలా ఉన్న ఒక్క ఫోటోను కూడా ఇప్పటి వరకు షేర్‌ చేయలేదు.

వామికా ఫోటో కోసం దంపతులిద్దరి ఫ్యాన్స్‌ చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కోహ్లీ-అనుష్క దంపతులు ఆదివారం బిడ్డతో కలిసి అహ్మాదాబాద్‌ విమానాశ్రయంలో కనిపించారు. ఇంగ్లండ్‌తో జరగబోయే మూడు వన్డే మ్యాచ్‌ల కోసం ఈ జంట భారత క్రికెట్ జట్టులోని ఇతర ఆటగాళ్లతో కలిసి పుణెకు వెళ్లడం కోసం అహ్మాదాబాద్‌ ఎయిర్‌ పోర్టుకు చేరుకున్నారు. 

ఈ సందర్భంగా తీసిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ ఫోటోల్లో విరాట్‌ లగేజ్‌ తీసుకెళ్తుండగా.. అనుష్క శర్మ బేబీ వామికాను ఎత్తుకుని ఉన్నారు. చిన్నారిముఖం కనిపించకుండా కవర్‌ చేశారు అనుష్క. ఇక వీరితో పాటు మరో జంట హర్దిక్ పాండ్యా దంపతులు కూడా తమ బేబీ అగస్త్యతో కలిసి విమానాశ్రయంలో కనిపించారు. ఇక కోహ్లీ దంపతుల ఫోటోలు చూసిన నెటిజనులు మరో సారి నిరాశకు గురయ్యారు. ‘‘ఏందిది కోహ్లీ భయ్యా.. ఇంకెన్నాళ్లు నీ చిన్నారిని దాచి పెడతావ్‌.. ఒకసారి వామికాను మాకు కూడా చూపించు’’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు. ఇంగ్లండ్‌తో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 3–2తో గెలుచుకున్న విషయం తెలిసిందే.

చదవండి:
అనుష్క, కూతురు ఫోటోతో కోహ్లి భావోద్వేగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement