
PC:IPL.com
ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసిన నైట్ రైడర్స్.. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్ర స్ధానంలో నిలిచింది. బుధవారం వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 106 పరుగుల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 272 పరుగుల రికార్డు స్కోర్‌ను సాధించింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 166 పరుగులకే కుప్పకూలింది. అయితే గెలుపు జోష్‌లో ఉన్న కేకేఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీతో మ్యాచ్‌లో ఆ జట్టు యువ పేసర్ హర్షిత్ రాణా గాయపడ్డాడు. బంతిని ఆపే క్రమంలో రాణా కుడి భుజానికి గాయమైంది.
దీంతో అతడు మ్యాచ్ మధ్యలోనే ఫీల్డ్‌ను వదిలివెళ్లిపోయాడు. ఆ తర్వాతి మరి అతడు ఫీల్డింగ్ రాలేదు. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో రాణా కనీసం ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు. మ్యాచ్ అనంతరం అతడిని స్కానింగ్ తరలించినట్లు తెలుస్తోంది.
ఇంకా అతడి గాయంపై ఎటువంటి అప్‌డేట్ కేకేఆర్ ఫ్రాంచైజీ నుంచి రాలేదు. ఒక వేళ అతడి గాయం తీవ్రమైనదిగా తేలితే ఏప్రిల్ 8న చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌కు దూరమయ్యే ఛాన్స్ ఉంది. రాణా ఇప్పటివరకు మూడు మ్యాచ్‌ల్లో 5 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: #Mayank Yadav: త్వరలోనే టీమిండియాకు ఆడతాడు.. నాన్ వెజ్ మానేశాడు! డైట్ ఇదే..
Comments
Please login to add a commentAdd a comment