గత కొన్ని రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు తెలుస్తుంది. ప్లేట్లెట్స్ పడిపోవడం కారణంగా రెండు రోజుల కిందట చెన్నైలోని ఆసుపత్రిలో అడ్మిట్ అయిన్ గిల్.. నిన్న డిశ్చార్జయ్యాడు. అసుపత్రి వర్గాల సమాచారం మేరకు గిల్ ప్లేట్లెట్స్ కౌంట్ సాధారణ స్థితికి చేరుకుందని తెలుస్తుంది.
వరల్డ్‌కప్‌లో భాగంగా అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్ సమయానికంతా గిల్ టీమిండియాకు అందుబాటులో ఉంటాడని సమాచారం. ఈ క్రమంలో అతను జట్టుతో కలిసేందుకు చెన్నై నుంచి అహ్మదాబాద్‌కు చేరుకున్నాడు. టీమిండియాతో కలిశాక కూడా మరో రోజు అతను బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో ఉంటాడని సమాచారం. ]
పాక్‌తో మ్యాచ్‌కు మరో రోజు సమయం ఉన్న నేపథ్యంలో గిల్ పూర్తిగా కోలుకుంటాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా, గిల్ డెంగ్యూ కారణంగా వరల్డ్‌కప్-2023లో భారత్ ఆడిన తొలి రెండు మ్యాచ్‌లకు (ఆసీస్, ఆఫ్ఘనిస్తాన్) దూరమైన విషయం తెలిసిందే. గిల్ లేకపోయినా ఈ రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా అద్భుత విజయాలు సాధించింది. ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్-రాహుల్ అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి టీమిండియాకు చిరస్మరణీయ విజయం అందించగా.. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ మెరుపు శతకంతో విజృంభించి ఒంటిచేత్తో టీమిండియా గెలిపించాడు.
ఇదిలా ఉంటే, హైదరాబాద్ నుంచి నిన్ననే అహ్మదాబాద్‌కు చేరుకున్న పాక్ జట్టు ఇవాళ ఉదయం నుంచి ప్రాక్టీస్ ప్రారంభించింది. ప్రాక్టీస్ సెషన్స్‌లో పాక్ ఆటగాళ్లు కఠోరంగా శ్రమిస్తున్నారు. ప్రపంచకప్‌లో తమపై తిరుగులేని ఆధిక్యం కలిగిన టీమిండియాను ఈసారి ఎలాగైనా ఓడించాలని వారు కసితో ప్రాక్టీస్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment