
భారత జట్టు(ఫైల్ ఫోటో)
టీ20 ప్రపంచకప్-2022కు ముందు భారత్‌కు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. భారత స్టార్ ఆల్ రౌండర్ దీపక్ హుడా గాయం కారణంగా స్వదేశంలో జరిగే దక్షిణాఫ్రికాతో సిరీస్‌తో పాటు టీ20 ప్రపంచకప్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. హుడా ప్రస్తుతం వెన్ను గాయంతో బాధపడుతున్నాడు.
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు ఎంపికైనప్పటికీ.. వెన్ను నొప్పి కారణంగా కేవలం బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ విషయాన్నిబీసీసీఐ ట్విటర్‌లో ఆదివారం వెల్లడించింది. "ఆస్ట్రేలియాతో మూడో టీ20 తుది జట్టు ఎంపికకు దీపక్ హుడా అందుబాటులో లేడు. అతడు వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు" అని బీసీసీఐ ట్విటర్‌లో పేర్కొంది.
కాగా గత కొంత కాలంగా హుడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌లో అదరగొట్టిన హుడా భారత జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక జట్టులో హుడా సభ్యుడిగా ఉన్నాడు.
చదవండి: IND Vs AUS: కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. రెండో భారత కెప్టెన్‌గా
Comments
Please login to add a commentAdd a comment