పురుషుల రికర్వ్ వ్యక్తిగత క్వాలిఫయింగ్ రౌండ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్, పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ధీరజ్ బొమ్మదేవర 693 పాయింట్లతో మూడో స్థానాన్ని పొందాడు. 684 పాయింట్లతో తరుణ్‌దీప్ రాయ్ ఏడో స్థానంలో, 672 పాయింట్లతో ప్రవీణ్ జాధవ్ 25వ స్థానంలో నిలిచారు.
మహిళల రికర్వ్ వ్యక్తిగత క్వాలిఫయింగ్ రౌండ్‌లో భారత క్రీడాకారిణులు అంకిత (664 పాయింట్లు), భజన్ కౌర్ (657 పాయింట్లు), దీపిక కుమారి (656 పాయింట్లు) వరుసగా 15వ, 29వ, 30వ స్థానాల్లో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment