ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం జరిగిన మూడో టి20లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇంగ్లీష్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. గ్లెన్ మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో స్టోక్స్ స్ట్రెయిట్ గ్రౌండ్ షాట్ ఆడాడు. కసిగా బాదడంతో బంతి కచ్చితంగా బౌండరీ వెళ్తుందని భావించిన స్టోక్స్ కనీసం సింగిల్‌కు పరిగెత్తకుండా పక్కకు వెళ్లాడు. అప్పటికే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బట్లర్ అప్పటికే సగం క్రీజుకు దాటేశాడు.
కానీ ఇక్కడే ఊహించని ట్విస్ట్ జరిగింది. బంతి బౌండరీ లైన్ దాటకుండా ఫీల్డర్ అడ్డుపడడంతో అప్పుడు అలర్ట్ అయిన స్టోక్స్ సింగిల్ కోసం పరిగెత్తాడు. క్రీజులోకి చేరుకునే సమయంలో జారిపడ్డాడు. అయితే బౌలర్ బంతిని అందుకోవడంలో విఫలం కావడంతో స్టోక్స్..''హమ్మయ్య బతికిపోయాను'' అనుకుంటూ ఆకాశంవైపు చూశాడు. దీనికి సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయండి.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సమయంలో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. వర్షం ఎంతకు తెరిపినివ్వకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. అంతకముందు వర్షం అంతరాయంతో మ్యాచ్‌ను 12 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 12 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది.
కెప్టెన్ జాస్ బట్లర్ 41 బంతుల్లో 65 పరుగులు నాటౌట్ రాణించాడు. 113 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఆట నిలిచిపోయే సమయానికి 3 వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది. దీంతో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను 2-0తో ఇంగ్లండ్ దక్కించుకుంది. కెప్టెన్ బట్లర్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.
Oh no Benjamin #AUSvENG pic.twitter.com/IautaqnIsF
— cricket.com.au (@cricketcomau) October 14, 2022
Comments
Please login to add a commentAdd a comment