లండన్: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో అద్భుత సెంచరీతో మెరిశాడు. 205 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌ర్ సాయంతో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కాగా రోహిత్ సిక్స్‌తో సెంచరీ సాధించడం విశేషం. రోహిత్ శర్మ సెంచరీల విషయంలో ఒక రికార్డును సాధించాడు. ఇప్పటివరకు రోహిత్ శర్మ టెస్టుల్లో 8 సెంచరీలు నమోదు చేయగా.. అందులో 7 సెంచరీలు స్వదేశంలోనే వచ్చాయి. తాజా సెంచరీ మాత్రం విదేశీ గడ్డపై వచ్చింది. అలా రోహిత్ శర్మ విదేశీ గడ్డపై టెస్టుల్లో తొలి సెంచరీ సాధించాడు.
చదవండి: ENG Vs IND: 'పుజారాతో పెట్టుకోకు ఓవర్టన్'.. వీడియో వైరల్
ఇక టీమిండియా నాలుగో టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడుతోంది. సెంచరీతో అదరగొట్టిన రోహిత్ 127 పరుగులు వద్ద ఓలీ రాబిన్‌సన్ బౌలింగ్‌లో వోక్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో పుజారా, రోహిత్‌ల 153 పరుగుల భాగస్వామ్యానికి తెరపడినట్లయింది. ఆ వెంటనే పుజారా(61) రాబిన్‌సన్ బౌలింగ్‌లో మొయిన్ అలీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 81 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. కోహ్లి 1 పరుగుతో క్రీజులో ఉన్నాడు.
చదవండి: Pujara Vs Rohit: 'సింగిల్ చాలు అన్నానుగా'.. పుజారాపై రోహిత్ అసహనం
Century with a six For Hitman 💥💙 @ImRo45 #RohitSharma pic.twitter.com/4L6JTdR5O8
— Mumbai Indians TN (@MumbaiIndiansTN) September 4, 2021
Comments
Please login to add a commentAdd a comment