రోహిత్‌ భయ్యా.. మాకు రెండు టికెట్స్‌ ఇప్పించవా | Fan Request Rohit Sharma Need 2 Tickets Please IND Vs Pak T20WC Clash | Sakshi
Sakshi News home page

T20 World Cup 2021: రోహిత్‌ భయ్యా.. మాకు రెండు టికెట్స్‌ ఇప్పించవా

Published Sat, Oct 9 2021 7:04 PM | Last Updated on Sat, Oct 9 2021 8:10 PM

Fan Request Rohit Sharma Need 2 Tickets Please IND Vs Pak T20WC Clash - Sakshi

India Vs Pak T20WC Clash.. టీమిండియా, పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ అంటేనే ఫ్యాన్స్‌లో ఎక్కడలేని ఉత్సాహం కనిపిస్తుంది. ఇరుజట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతుందంటే ప్రజలంతా టీవీలకు అతుక్కుపోయిన సందర్భాలు ఎక్కువే.. అలాంటిది మ్యాచ్‌ను ప్రేక్షకుల మధ్య చూస్తే ఆ మజా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా యూఏఈ వేదికగా టి20 ప్రపంచకప్‌ 2021లో టీమిండియా, పాకిస్తాన్‌ల మధ్య అక్టోబర్‌ 24న మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటికే మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి.

చదవండి: IPL 2021: టీ20 వరల్డ్‌కప్‌ బాగా ఆడు.. కానీ గెలవకూడదు.. ఓకేనా!

ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ 2021లో శుక్రవారం ముంబై ఇండియన్స్‌, ఎస్‌ఆర్‌హెచ్‌ల మధ్య జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు హాజరైన ఒక అభిమాని టీమిండియా-పాకిస్తాన్‌ మ్యాచ్‌కు రెండు టికెట్లు కావాలంటూ రోహిత్‌ శర్మను విజ్ఞప్తి చేయడం ఆసక్తికరంగా మారింది. '' రోహిత్‌ భయ్యా.. ఇండియా, పాకిస్తాన్‌ మ్యాచ్‌కు మాకు రెండు టికెట్లు ఇప్పించవు.. ప్లీజ్‌'' అంటూ ప్లకార్డు చేతపట్టుకొని ఒక అభిమాని అడిగాడు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది. 

ఇక ఐసీసీ టి20 ప్రపంచకప్‌ టోర్నీల్లో పాకిస్తాన్‌ ఇంతవరకు ఒక్కసారి కూడా టీమిండియాను ఓడించలేకపోయింది. ఇరు జట్లు ఐదుసార్లు తలపడగా.. టీమిండియానే విజయం వరించింది. అందులో టి20 ప్రపంచకప్‌ 2007 ఫైనల్‌ కూడా ఉండడం విశేషం. మరోవైపు ఈ ప్రపంచకప్‌లో టీమిండియాను పాక్‌ ఓడిస్తే ఆ జట్టు సభ్యులకు బ్లాంక్‌ చెక్‌ ఇస్తానంటూ పీసీబీ చైర్మన్‌ రమీజ్‌ రజా సంచలన వ్యాఖ్యలు చేశాడు.

చదవండి: శిఖా పాండే అద్భుతం.. వుమెన్స్‌ క్రికెట్‌ చరిత్రలో 'బాల్‌ ఆఫ్‌ ది సెంచరీ'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement