కరోనా కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 మళ్లీ సెప్టెంబర్ 19న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో లీగ్ సెకెండ్ ఫేజ్‌కు కొంత మంది ఆటగాళ్లు వివిధ కారణాల వల్ల దూరమయ్యారు. వీరి స్ధానంలో కొన్ని కొత్త ముఖాలు కనిపించబోతోన్నాయి. ఎంట్రీ ఇచ్చిన ఆటగాళ్ల పై ఓ లుక్కేద్దాం..
ఆర్‌సీబీలోకి ఐదుగురు న్యూ ఎంట్రీ
ఐపీఎల్ 14వ ఎడిషన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుస విజయాలతో దూసుకుపోతుంది. అయితే లీగ్ సెకెండ్ ఫేజ్‌కు ఐదుగురు ఆటగాళ్లు దూరమయ్యారు. వీరిలో నలుగురు విదేశీ ప్లేయర్లు తప్పుకోవడం గమనార్హం. అయితే వీళ్ల స్ధానంలో ఆర్‌సీబీ ఐదుగురు కొత్త ఆటగాళ్లతో ఒప్పందం కుదుర్చుకుంది. కాగా బెంగళూరు సెకెండ్ ఫేజ్‌లో తన తొలి మ్యాచ్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది.
దూరమైన ఆటగాళ్లు: ఆడం జంపా, డేనియల్ సామ్స్, కేన్ రిచర్డ్సన్, ఫిన్ ఆలెన్, వాషింగ్టన్ సుందర్.
ఎంట్రీ ఇచ్చిన ఆటగాళ్లు: వనిందు హసరంగ, దుశ్మంత చమీరా, జార్జ్ గార్టన్, టిమ్ డేవిడ్, ఆకాశ్ దీప్.
రాజస్తాన్ రాయల్స్ నాలుగు కొత్త ముఖాలు:
సంజూ సామ్సన్ సారథ్యంలోని రాజస్తాన్ రాయల్స్‌కు ఐపీఎల్ సెకండ్ ఫేజ్‌కు ముందు గట్టి ఎదరు దెబ్బ తగిలింది అనే చెప్పుకోవాలి. ఆ జట్టు ముఖ్యంగా ఇంగ్లండ్ కు చెందిన స్టార్ ఆటగాళ్లు సేవలను కోల్పోతుంది. రాజస్తాన్‌కు మెత్తం నలుగురు విదేశీ ప్లేయర్లు దూరం కానున్నారు. వీరి స్థానంలో నలుగురు విదేశీ ఆటగాళ్లు కొత్తగా ఎంట్రీ ఇచ్చారు.
దూరమైన ఆటగాళ్లు: జోస్ బట్లర్, ఆండ్రూ టై, బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్.
ఎంట్రీ ఇచ్చిన ఆటగాళ్లు: గ్లెన్ ఫిలిప్స్, తబ్రైజ్ షామ్సీ, ఎవిన్ లూయిస్, ఒసానే థామస్.
పంజాబ్ కింగ్స్‌లో ముగ్గురు న్యూ ఎంట్రీ
కేఎల్ రాహుల్ సారధ్యంలోని పంజాబ్ జట్టు ఐపీఎల్ 14వ సీజన్ తొలి దశలో వరుస అపజయాలతో పేలవ ప్రదర్శన కొనసాగిస్తుంది. ఈ తరుణంలో జట్టుకు ముగ్గురు విదేశీ స్టార్ ఆటగాళ్లు దూరమవడం భారం కానుంది.
దూరమైన ఆటగాళ్లు: రిలే మెరిడిత్, జై రిచర్డసన్, డేవిడ్ మాలన్
ఎంట్రీ ఇచ్చిన ఆటగాళ్లు: ఆదిల్ రషీద్, నాథన్ ఎలిస్, ఎయిడిన్ మారక్రమ్
ఢిల్లీ క్యాపిటల్స్
రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో ఆగ్రస్థానంలో నిలిచింది. ఐపీఎల్ సెకండ్ ఫేజ్‌లో ఢిల్లీ ఒకే ఒక్క విదేశీ ఆటగాడు దూరమయ్యాడు.
దూరమైన ఆటగాళ్లు: క్రిస్ వోక్స్
ఎంట్రీ ఇచ్చిన ఆటగాళ్లు: బెన్ డ్వార్వూస్
కోల్‌కతా నైట్‌రైడర్స్
దూరమైన ఆటగాళ్లు: పాట్ కమిన్స్
ఎంట్రీ ఇచ్చిన ఆటగాళ్లు: టిమ్ సౌథీ
సన్ రైజర్స్ హైదరాబాద్
దూరమైన ఆటగాళ్లు: జానీ బెయిర్ స్టో
ఎంట్రీ ఇచ్చిన ఆటగాళ్లు: రూథర్ పర్ఢ్
కాగా చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐపీఎల్ తొలి దశకు గాయం కారణంగా దూరమైన ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హాజల్‌వుడ్ ఐపీఎల్ సెకండ్ ఫేజ్‌కు అందుబాటులో ఉన్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ జట్టులో ఎటువంటి మార్పులేమీ లేవు. కాగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఆదివారం జరిగే తొలి మ్యాచ్‌తో ఈ ధనాధన్ లీగ్ సందడి మొదలవ్వనుంది.
చదవండి: IPL 2021 2nd Phase Schedule: ఐపీఎల్ 2021 రెండో ఫేజ్ షెడ్యూల్ ఇలా..
Comments
Please login to add a commentAdd a comment