
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో అయ్యర్ స్థానంలో దేశీవాళీ క్రికెట్‌లో పరుగులు వరద పారిస్తున్న ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌కు సెలక్టర్లు పిలుపునివ్వనున్నట్లు సమాచారం. అదే విధంగా టెస్టు సిరీస్ సమయానికి అయ్యర్ కోలుకపోతే.. సూర్యకుమార్ యాదవ్ టెస్టు అరంగేట్రం చేయనున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఆసీస్‌తో తొలి రెండు టెస్టులకు ప్రకటించిన భారత జట్టులో సూర్యకుమార్, ఇషాన్ కిషన్ చోటు దక్కిన సంగతి తెలిసిందే.
"శ్రేయస్ ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు. అతడి గాయం తీవ్రత తెలుసుకోవడానికి మరిన్ని పరీక్షలు చేయాలి. ప్రస్తుతం మా దగ్గర ఉన్న రిపోర్ట్స్ ప్రకారం.. అయ్యర్ మొదటి మూడు టెస్టులకు అందుబాటులో ఉండడం కష్టమనే చెప్పుకోవాలి. కానీ టెస్టు సిరీస్‌కు ఇంకా సమయం ఉంది.
ఆ సమయానికి అయ్యర్ కోలుకుంటే కచ్చితంగా జట్టు సెలక్షన్‌కు అందుబాటులో ఉంటాడు. ఒకవేళ శ్రేయస్ టెస్టు సిరీస్ సమయానికి కోలుకోకపోతే సూర్యకి తుది జట్టులో అవకాశం దక్కనుంది. అదే విధంగా సర్ఫరాజ్ ఖాన్ పేరును కూడా సెలక్టర్లు పరిశీలించే అవకాశం ఉంది" అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ఇన్‌సైడ్ స్పోర్ట్‌తో పేర్కొన్నారు. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆసీస్‌తో నాలుగు టెస్టుల్లో తలపడనుంది. ఫిబ్రవరి 9నుంచి నాగ్‌పూర్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ ((వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, సి పుజారా, వి కోహ్లి, ఎస్ అయ్యర్, కెఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్. షమీ, మొహమ్మద్. సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, సూర్యకుమార్ యాదవ్
Comments
Please login to add a commentAdd a comment